*రథసప్తమి వేడుకలు సరికొత్త అనుభూతి*
*జిల్లా అధికార యంత్రాంగం సమిష్టి కృషి అభినందనీయం*
*రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు*
విజయవాడ :
రాష్ట్ర పండుగ రథసప్తమి వేడకల్లో భాగంగా శ్రీ అరసవల్లి సూర్యనాయారణ స్వామి వారి సందర్శనార్ధం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు, అసౌకర్యం
లేకుండా జిల్లా అధికార యంత్రాంగం చేసిన కృషి అభినందనీయమని గౌరవ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. విజయవాడ నుంచి ఆయన జిల్లా అధికారులతో మాట్లాడారు. జిల్లాలోని రథసప్తమి వేడుకలు నభూతో నభవిష్యత్ అన్న రీతిలో నిర్వహించడం ఆనందంగా ఉందని అన్నారు.ఈ ఉత్సవాలకు సహకరించిన ప్రజలకు అభినందనలు తెలిపారు. క్షేత్రస్థాయిలో అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఎక్కడ ఇబ్బందులు కలగకుంగా సజావుగా ఉత్సవాలు నిర్వహించిన రాష్ట్ర పండుగగా అరసవల్లి కీర్తిని ప్రతిష్టతను పెంచగలిగారని అన్నారు. మూడు రోజుల పాటు నిర్వహించిన ఈ వేడుకల కొరకు గత నెల రోజుల పాటుగా శ్రమించిన అధికార యంత్రాంగాన్ని మంత్రి అభినందించారు.