కౌలాస్ లో ఘనంగా రాథోత్సవం

కౌలాస్ లో ఘనంగా రాథోత్సవం

ప్రశ్న ఆయుధం 05 ఫిబ్రవరి (జుక్కల్ ప్రతినిధి )

రథ సప్తమి సందర్బంగా అగ్ని

జుక్కల్ మండలం కౌలాస్ లో రథ సప్తమి వేడుకలుశనివారం ఘనంగా నిర్వహించారు. వృషబలింగ శివాచర్య మహారాజ్ అద్వర్యం లో జరిగిన ధర్మ సభ కార్యక్రమం లో మహన్తేశ్వరా మాటాధిపతి మల్లికార్జున స్వామి మహారాజ్, హనేగామ్ మహారాజ్ శంకర్ లింగ స్వామి మహారాజ్ లు పాల్గొని ప్రవచం చేశారు. బుధవారం తెల్లవారు జామున రథన్ని లాగుతూ సాంప్రదాయ నృత్యాలతో గ్రామ విధుల్లో ఊరేగింపు జరిపారు. అనంతరం మహాదేవ్ మందిరం దగ్గర నిర్వహించిన అగ్ని కుండం లో కన కన మండే నిప్పు లపై నడిచి భక్తులు తమ భక్తిని చాటుకున్నారుతెలంగాణాతో పాటు కర్ణాటక మహారాష్ట్ర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు, భజనలతో రథన్ని లాగడం లో, అగ్ని కుండం లో భక్తులు పోటా పోటీగా పాల్గొన్నారు. కార్యక్రమం లో కౌలాస్ మాజీ సర్పంచ్ గొల్ల హన్మాండ్లు, మాజీ వైస్ ఎంపీపీ ఉమాకాంత్ దేశాయి, నాయకులు శంకర్ పటేల్, విట్టల్ పటేల్,వీరేష్ పటేల్ ప్రకాష్ పటేల్, బోడ సాయిలు, చిన్న హన్మగౌడ్, పాకాలి వెంకటి, బి గంగాధర్, మల్లప్ప, కలయిక నారాయణ, సంగప్ప బాబాప్ప వినయ పటేల్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment