రేషనలైజేషన్‌ జి.ఓ.25 నిబంధనలను మార్చాలి

రేషనలైజేషన్‌ జి.ఓ.25 నిబంధనలను మార్చాలి

– అశాస్త్రీయమైన సర్దుబాటు ప్రక్రియను నిలుపుదల చేయాలి
– ఉపాధ్యాయుల సర్దుబాటుతో బదిలీ అయిన ఎస్‌.జి.టి.లను రిలీవ్‌ చేయాలి

ఎస్సి, ఎస్టీ ఉపాద్యాయ సంఘం రాష్ర్ట అధ్యక్షులు కొంగల వెంకట్

ప్రశ్న ఆయుధం న్యూస్, సెప్టెంబర్ 23, కామారెడ్డి :

రేషనలైజేషన్‌ జి.ఓ.25 నిబంధనలను మార్చాలని ఎస్సి,ఎస్టీ ఉపాద్యాయ సంఘం రాష్ర్ట అధ్యక్షులు కొంగల వెంకట్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తరగతికి ఒక గది, తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండి విద్యార్థులను వారి తల్లిదండ్రులను ప్రభుత్వ పాఠశాలల వైపు ఆకర్షించవలసి ఉండగా అశాస్త్రీయమైన జి.ఓ. 25 అమలు చేయాలని పాఠశాల విద్యా సంచాలకులు జిల్లా కలెక్టర్లను ఆదేశించడాన్ని ఎస్ సి, ఎస్టీ ఉపాద్యాయ సంఘం తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు.
ఎస్సి,ఎస్టీ ఉపాద్యాయ సంఘం రాష్ర్ట అధ్యక్షుడు కొంగల వెంకట్ మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాలలో 11 మంది విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులు, అదే విధంగా 60 మంది విద్యార్థులకు కూడా ఇద్దరే ఉపాధ్యాయులను కేటాయించాలని పేర్కొనడం అసంబద్ధమైన విషయమని అన్నారు. అదేవిధంగా ఇటీవల జరిగిన సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయుల బదిలీలలో పాఠశాల విద్యా శాఖ పాటించిన నిబంధనలను కూడా అమలు చేయడకపోవడం ఎస్సి, ఎస్టీ ఉపాద్యాయ సంఘం ఆందోళన వ్యక్తం చేసిందన్నారు.
ప్రతి ప్రాధమిక పాఠశాలలో ఇద్దరు ఉపాద్యాయులుండే విధంగా, 40 మంది వరకు ఇద్దరు, 60 మంది వరకు ముగ్గురు, ప్రతి 20 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుని చొప్పున కేటాయించాలని, ప్రతి ప్రాథమిక పాఠశాల కు ప్రధానోపాయుడిని నియమించి ఉపాధ్యాయులను భోదనేతర పనుల నుండి మినహాయించాలని ఎస్సీ,ఎస్టీ ఉపాద్యాయ సంఘం కోరుతుందన్నారు. నేటి సామాజిక పరిస్థితులను పరిగణలోనికి తీసుకొని ఉన్నత పాఠశాలలో ప్రతి 25 మంది విద్యార్థులకు ఒక సెక్షన్‌గా పరిగణించి ప్రభుత్వ ఉత్తర్వులు 25 ను సవరించాలని ఎస్సి, ఎస్టీ ఉపాద్యాయ సంఘం పక్షాన డిమాండ్‌ చేస్తున్నామన్నారు. అంతేకాకుండా డియస్సీ నియామకాలు జరగాల్సిన సమయంలో సర్దుబాటు ఉత్తర్వులు ఇవ్వటాన్ని బట్టి నియామకాలు ఇప్పట్లో చేసే ఉద్దేశ్యం లేదా అనే అనుమానం కలుగుతున్నదన్నారు. ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ ద్వారానైన బదిలీ అయిన ఎస్‌.జి.టి. ఉపాధ్యాయులందరినీ రిలీవ్‌ చేయాలని కోరుచున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు కొంగల వెంకట్, జిల్లా అధ్యక్షులు ప్రవీణ్ నాయక్, రాష్ట్ర కోశాధికారి సంగయ్య ప్రధాన కార్యదర్శి సాంబయ్య నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now