జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా రత్నకుమార్

కార్యదర్శి గా గోపి ఏకగ్రీవంగా ఎన్నిక

జిల్లా ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక ఉమ్మడి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రెస్ క్లబ్ & వెల్ఫేర్ సొసైసీ నూతన కార్యవర్గం ఎన్నిక బుధవారం కొత్తగూడెంలో ఏకగ్రీవంగా జరిగింది. ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా రత్న కుమార్ (వార్తతరంగాలు) , ప్రదాన కార్యదర్శిగా శెట్టి గోపి (టైమ్స్ పవర్ ) ,కోశాధికారిగా డొంకన చంద్రశేఖర్ (వి5 ) , ఉపకోశాదికారిగా ఎస్. ఋషి కుమార్ ( నేటిసూర్య ), ఉపాధ్యాయులు గా రవి(999 టి వి), రామారావు( తొలి క్రాంతి), జాయింట్ సెక్రెటరీగా బాలకృష్ణ (95న్యూస్), ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా జి.శ్రీనివాసరావు ( మన ప్రగతి), రంజిత్ ఆనంద్( మీ వార్త),చీఫ్ అడ్వైజర్స్ గా కె. రవీందర్ ( తెలుగు నాడు), డి. శ్రీనివాస్( డిఎస్ఆర్ హబ్), కార్యవర్గ సభ్యులుగా , ధర్మారావు, వి. నాగయ్యలను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు రత్న కుమార్, ప్రధాన కార్యదర్శి గోపి మాట్లాడుతూ జిల్లాలో విలేఖర్లు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించేలా కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. అలాగే విలేఖర్లకు ఇళ్లు, ఇళ్ల పట్టాలు త్వరగా అందేలా చర్యలు తీసుకుంటామని భరోసానిచ్చారు. ప్రెస్ క్లబ్ లో ఇన్న జర్నలిస్ట్ ల అందరికీ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తామని ఇంకా విలేఖర్ల కుటుంబాలకు ఆపదలో అండగా ఉంటామని క్లబ్ అభివృద్ధికి కృషి చేస్తామని హామిని చ్చారు.

Join WhatsApp

Join Now