కార్మికునికి అండగా నిలిచిన శ్రమశక్తి అవార్డు గ్రహీత నేత రవీసింగ్

*కార్మికునికి అండగా నిలిచిన శ్రమశక్తి అవార్డు గ్రహీత నేత రవీసింగ్*

*ప్రశ్న ఆయుధం ఏప్రిల్ 24 కుత్బుల్లాపూర్*

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని “రిషిక్ ఇంజనీరింగ్ సర్వీస్ శ్రీరామ్ నగర్ సూరారం” ఇండస్ట్రియల్ ఏరియా కంపెనీ లో పవన్ కుమార్ కార్మికుడు ఒక కాంట్రాక్టర్ అవినాష్ దగ్గర గత కొన్ని సంవత్సరాల నుంచి కంపెనీలో పని చేసేవాడు. కంపెనీ యజమాన్యం పవన్ కుమార్ అనే హెల్పర్ కు గత నెల ఫిబ్రవరి వేతనం ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుండడంతో డ్యూటీ మానేయడం జరిగింది… ఫిబ్రవరి నెల వేతనం ఇవ్వాల్సి ఉండగా పలుమార్లు కంపెనీ కాంట్రాక్టర్ అవినాష్ ను అడిగినా నిర్లక్ష్యం వహిస్తూ పట్టించుకోకపోవడంతో విసుగు చెందిన కార్మికుడు తనకు తెలిసిన తోటి కార్మికుల ద్వారా మనకు ఎవరైతే న్యాయం చేస్తారో అని తెలుసుకొని, బిఆర్టియు రాష్ట్ర కార్మిక నాయకుడు శ్రమశక్తి అవార్డు గ్రహీత రవిసింగ్ గురించి తెలుసుకొని తన కార్యాలయం వద్దకు వచ్చి తనకు జరిగిన అన్యాయం గురించి వివరించారు.

వెంటనే స్పందించిన కార్మిక నాయకుడు రవిసింగ్ హుటాహుటిన కంపెనీ వద్దకు బయలుదేరి కంపెనీ కాంట్రాక్టర్ అవినాష్ తో పలుమార్లు చర్చించి కార్మికుడు పవన్ కుమార్ కు రావాల్సిన ఫిబ్రవరి నెల వేత్తనం ఇప్పించడం జరిగింది.

కార్మికుడు పవన్ కుమార్ మాట్లాడుతూ ఈ రోజుల్లో కూడా కార్మికులకు న్యాయం చేయడంలో ముందుండి ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా ఊరుకునే ప్రసక్తే లేదని, ప్రతి కార్మికునికి న్యాయం చేస్తున్న రవి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో అనిల్, సుదర్శన్, జగన్, కిరణ్, తదితరులు పాల్గొన్నారు..

Join WhatsApp

Join Now