ఘనంగా రవి కుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకలు
ప్రశ్న ఆయుధం మే17: శేరిలింగంపల్లి ప్రతినిధి
గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే రవి కుమార్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ నగర్ లోని కార్పొరేటర్ కార్యాలయం వద్ద బీజేపీ పార్టీ ప్రజా ప్రతినిధులు, డివిజన్ అధ్యక్షులు, సీనియర్ నాయకుల, మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సoదర్భంగా కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి రవి కుమార్ యాదవ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ గచ్చిబౌలి డివిజన్ బీజేపీ పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం, కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ, రవి కుమార్ యాదవ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక స్పష్టమైన దిశా నిర్దేశకులుగా ఎదుగుతున్నారని ప్రజల సమస్యల పట్ల ఆయనకు ఉన్న చిత్తశుద్ధి, పార్టీ అభివృద్ధిపట్ల ఆయన చూపించే నిబద్ధత ఈ తరం నాయకులకు ఆదర్శంగా నిలుస్తుందని భవిష్యత్తులో ఆయన మరిన్ని ఉన్నత స్థానాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని పేర్కొన్నారు. అలాగే పలువురు నేతలు కూడా రవి కుమార్ యాదవ్ నాయకత్వ లక్షణాలను కొనియాడుతూ, ఆయన నాయకత్వంలో పార్టీ మరింత బలపడుతుందని అభిప్రాయపడ్డారు. రవి కుమార్ యాదవ్ ఇలాంటి పుట్టిన రోజు వేడుకలు మరేన్నో జరుపుకోవాలని కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, డివిజన్ అధ్యక్షులు, మహిళా అధ్యక్షురాలు, సీనియర్ నాయకులు, మహిళలు, కార్యకర్తలు, యువకులు, అభిమానులు పాల్గొన్నారు.