హలో కిడ్స్ ఫిలాసఫీ ఫ్రీ స్కూల్ను ప్రారంభించిన రవికుమార్ యాదవ్ 

హలో కిడ్స్ ఫిలాసఫీ ఫ్రీ స్కూల్ను ప్రారంభించిన రవికుమార్ యాదవ్

ప్రశ్న ఆయుధం మే07: శేరిలింగంపల్లి ప్రతినిధి

IMG 20250507 WA1259 scaled డివిజన్ ,వినాయక్ నగర్ రోడ్ లో హలో స్కూల్ కరస్పాండెంట్ ప్రసూన-బుచ్చయ్య గుప్తా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రవి కుమార్ యాదవ్ హాజరై , ప్రారంభించడం జరిగింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీచర్స్ బృందం అత్యంత అనుభవిజ్ఞులై ఉండి పిల్లల పట్ల అంకితభావం కలిగిన వారై ఉండాలి వారు కేవలం పాఠాలు చెప్పడమే కాకుండా,పిల్లలతో స్నేహంగా ఉంటూ, వారి సందేహాలను తీరుస్తూ వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ, ఆటపాటలతో కూడిన ఆహ్లాదకరమైన బోధనా అందించినట్లయితే, పిల్లలు నేర్చుకోవడం ఒక భారంగా కాకుండా ఒక ఆనందంగా పాఠాలు నేర్చుకుంటారని తెలుపుతూ స్కూల్ యాజమాన్యానికి ఫీజుల నియంత్రణ పద్ధతి పాటిస్తూ తల్లిదండ్రులపై భారం మోపకుండా ఒక నిర్దిష్టమైన ఫీజులను వసూలు చేయాలని రవి కుమార్ యాదవ్ కోరారు.

ఈ కార్యక్రమంలో బిజెపి స్టేట్ కౌన్సిల్ మెంబర్ కేశవ వీరమల్లు,సీనియర్ నాయకులు మహేష్ యాదవ్, అధ్యక్షులు జితేందర్,లక్ష్మణ్, గణేష్, మహేందర్, నరేందర్ పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now