రూ.10 నాణేలు తీసుకోవట్లే..

నాణేలు
Headlines
  1. రూ.10, రూ.20 నాణేలు తిరస్కరిస్తే జైలుశిక్ష – ఆర్బీఐ హెచ్చరిక
  2. నాణేలు తీసుకోవాలన్న ఆర్బీఐ ఆదేశాలు పట్టని వ్యాపారులు
  3. నాణేలను తిరస్కరిస్తే ఐపీసీ సెక్షన్‌ 124 కింద చర్యలు
  4. నగదు వినియోగం తగ్గడంతో నాణేలు తిరస్కరణ పెరిగింది
  5. నాణేలు చెల్లుబాటు విషయంలో వ్యాపారులకు అవగాహన కల్పించాలి
 ఆర్బీఐ నిబంధనలు పట్టని వ్యాపారులు

– ఇబ్బందులు పడుతున్న కొనుగోలుదారులు

హైదరాబాద్: అన్ని వర్తక సముదాయాల్లో కొనుగోలుదారుల ఇచ్చే 10, 20 నాణేలు తీసుకోవాలని, లేకపోతే జైలుకి వెళ్ళాల్సి ఉంటుందని ఆర్బీఐ తాజా ప్రకటన జారీచేసిన సంగతి విదితమే. కానీ దీనికి విరుద్దంగా కొందరు వ్యాపారులు నాణేలను తిరస్కరిస్తున్నారు. పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, కర్నాటక, యూపీ తదితర రాష్ట్రాల్లో ఇవి చెల్లుబాటులో ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు చెల్లుబాటు కావడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు జీవనోపాధిని వెతుక్కుంటూ హైదరాబాద్‌కు వలస వస్తుంటారు.

అలా వచ్చినవారు ఆ రాష్ట్రాల్లో చెల్లుబాటవుతున్న 10, 20 నాణేలను కొనుగోలు నిమిత్తం ఇస్తుంటే ఇక్కడ తిరస్కరిస్తుండటంతో ఇబ్బందులు పడుతున్నారు. ఆర్బీఐ ఉత్తర్వుల మేరకు అన్ని షాపుల్లో ఇవి చెల్లేవిధంగా అధికారులు చర్యలు చేపట్టడంతో పాటు వ్యాపారులకు అవగాహన కల్పించాలని కోరుతున్నారు. డిజిటల్‌ మనీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఫోన్‌పే, గూగుల్‌పే, అమెజాన్‌పే, భారత్‌పే, ఏటీఎంలకు అలవాటు పడి 10, 20 నాణేలు, కొంచెం చిరిగిన నోట్లను తిరస్కరిస్తున్నారు.

డిజిటల్‌ పేమెంట్‌లు తెలియనివారు తమవద్ద ఉన్న నాణేలను ఏమిచేయాలో తెలియని సందిగ్ధంలో ఉన్నారు. 10, 20 నాణేలు చెల్లుబాటులోనే ఉన్నాయని వాటిని తిరస్కరిస్తే ఐపీసీ సెక్షన్‌ 124 ప్రకారం ఫిర్యాదు చేయాలని, విచారణలో రుజువైతే మూడు సంవత్సరాల వరకు జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుందని ఆర్బీఐ ఉత్తర్వుల్లో పేర్కొంది..

Join WhatsApp

Join Now

Leave a Comment