*Reserve Bank of India: 2,000/- రూపాయల నోట్లపై ఆర్‌బీఐ కీలక ఆదేశాలు*
బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న అతి పెద్ద నిర్ణయాల్లో డీమోనిటైజేషన్ ఒకటి. అప్పటివరకు చలామణీలో ఉన్న 500, 1000 రూపాయల కరెన్సీ నోట్లను రద్దు చేస్తూ వాటి స్థానంలో 500, 2,000 రూపాయల నోట్లను 2016 నవంబర్ 8 నుండి అమలులోనికి ప్రభుత్వం తీసుకువచ్చింది.
అప్పటివరకు చలామణీలో దొంగనోట్లకు డీమోనిటైజేషన్ పూర్తి స్థాయిలో అడ్డుకట్టవేయడం ద్వారా భారతదేశంలో ఉగ్రవాదాన్ని నియంత్రించ వచ్చు, నల్ల ధనాన్ని కూడా వెలికి తీయవచ్చు అంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం.
ఎలక్షన్ లో పంచే ఓటుకు నోటు విలువ కూడా పెరిగిపోతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తడంతో… మరల కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయల నోట్లను ఉపసంహరించుకుంది. ఈ నేపథ్యంలో అప్పటివరకు చలామణీలో ఉన్న 2,000 రూపాయల నోట్లను వెనక్కి బ్యాంకులకు చెల్లించడానికి పలుమార్లు అవకాశం ఇచ్చింది.
రూ.2వేల విలువైన కరెన్సీ నోటును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉపసంహరించుకుని దాదాపు 20 నెలల పైనే అయినప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో ఉపసంహరణ జరగలేదని ఆర్బీఐ స్పష్టం చేసింది.ఇంకా రూ.6471 కోట్ల విలువైన రూ.2వేల రూపాయల నోట్లు ప్రజల చేతుల్లోనే ఉన్నాయని తాజాగా ఆర్‌బీఐ (RBI) వెల్లడించింది.
దీనితో రూ.2వేల నోట్ల మార్పిడిపై ఆర్‌ఐబీ మరోసారి కీలక ఆదేశాలు జారీ చేసంది. ఇంకా ప్రజల చేతుల్లో ఉన్న నోట్లను ఆర్‌ఐబీ ప్రాంతీయ కార్యాలయాల వద్ద నోట్లను మార్పిడి/ డిపాజిట్ చేసుకోవచ్చని కేంద్ర బ్యాంక్ తెలిపింది. రీజనల్ ఆఫీసులకు చేరుకోలేనివారు పోస్టల్ డిపార్ట్‌మెంట్ ద్వారా ఆయా కార్యాలయాలకు పంపొచ్చని పేర్కొంది.
హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగళూరు, బేల్‌పుర్, భోపాల్, భువనేశ్వర్, ఛండీగడ్, చెన్నై, గువాహటి, జైపుర్, జమ్మూ, కాన్పుర్, కోల్‌కతా, లఖ్‌నవూ, ముంబయి, నాగ్‌పుర్, దిల్లీ, పట్నా, తిరువనంతపురంలో ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి.