వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన భద్రాచలం ఆర్డీవో
ప్రశ్న ఆయుధం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్స్ జూలై 23
ఎగువున కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 51.6 అడుగులకు చేరుకుంది బూర్గంపాడు మండలంలో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి బూర్గంపాడు మండల కేంద్రంలో పలు ఇండ్లలోకి వరద నీరు చేరుకుంది అధికారులు అప్రమత్తం అయ్యి ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు బూర్గంపాడు కస్తూరిబా పాఠశాలలో ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రాన్ని తనిఖీచేసి వసతుల గురించి వరద బాధితులను అడిగి తెలుసుకున్నారు సారపాక నాగినేనిప్రోలు మోతే ఇరవెండి గ్రామాలలో పర్యటించి అక్కడ ఉన్న పరిస్థితులను గ్రామస్తులను తాసిల్దార్ ముజాహిద్ ని అడిగి తెలుసుకున్నారు ప్రజలు అధికారులకు సహకరించాలి కోరారు
వరద ప్రాంతాల్లో ఆర్డీవో..
Published On: July 23, 2024 3:10 pm