మెదక్ పట్టణంలో సమగ్ర సర్వే డేటాఎంట్రీ పరిశీలించిన ఆర్డీవో రమాదేవి.
ఉమ్మడి మెదక్ జిల్లా
శుక్రవారం మెదక్ పట్టణంలో సిద్ధార్థ హై స్కూల్,ఎంపీడీవో కార్యాలయం,ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్న డేటా ఎంట్రీ ప్రక్రియను ఆర్డీవో రమాదేవి పరిశీలించారు.ఈ సందర్భంగా ఆర్డీవో రమాదేవి మాట్లాడుతూ డేటాఎంట్రీ ఆపరేటర్లు తప్పుడు లేకుండా ఆన్లైన్ ఎంట్రీ నిర్వహించాలని సూచించారు. సమగ్ర కుటుంబ సర్వేలో ప్రజల వివరాలు గోప్యంగా ఉంచాలని అన్నారు.డేటా ఎంట్రీ నమోదులు తప్పులు జరుగుతే సహించేది లేదని అన్నారు.ఈ కార్యక్రమంలో తాసిల్దార్ లక్ష్మణ్ బాబు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీవో కార్యాలయాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.