సిపిఎస్ ను రద్దుచేసి, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఆర్ డి ఓ వినతి..
సిపిఎస్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయులు శుక్రవారం బాన్సువాడ ఆర్ డి ఓ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా టిఎస్ సీపీఎస్ఈ యు జిల్లా ఉపాధ్యక్షులు విట్టల్ యాదవ్ మాట్లాడుతూ 2004 తర్వాత ఉద్యోగంలోకి వచ్చిన ఉద్యోగ ఉపాధ్యాయులకు సిపిఎస్ విధానం ఒక శాపంలా మారిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో 28 కి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఎన్నికల మేని పెస్టోలో పొందుపరిచిన విధంగా పాత పెన్షన్ స్కీంను పునరుద్ధరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.