Site icon PRASHNA AYUDHAM

వైఎస్ఆర్సీపీలోకి రీ ఎంట్రీ ఇస్తున్న విజయసాయి రెడ్డి, ఆమంచి కృష్ణమోహన్..!!

IMG 20250810 WA0015

వైఎస్ఆర్సీపీలోకి రీ ఎంట్రీ ఇస్తున్న విజయసాయి రెడ్డి, ఆమంచి కృష్ణమోహన్

రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు. శాశ్వత శత్రువులు ఉండరు కదా!. ఇప్పుడు ఇదే ఫార్ములా వైసీపీ విష యంలోనూ జరుగుతోంది. పార్టీని కాదని వెళ్లిపోయిన.. కొందరు నాయకులు పట్టుమని ఏడాదిన్నర కూడా కాకుండానే..

తిరిగి వైసీపీలోకి వస్తున్నారని సీనియర్ల మధ్య చర్చ సాగుతోంది. అయితే.. ఇలా వచ్చేవారే మీ చోటా మోటా నాయకులు కాదని చెబుతున్నారు. ప్రధానంగా ఎప్పటినుంచో వినిపిస్తున్న పేరు వి. విజ యసాయి రెడ్డి. గతంలో పార్టీని అన్ని విధాలా ముందుకు నడిపించారు. విశాఖ వంటి బలమైన టీడీపీ కంచుకోటలో పాగా వేసేలా చేశారు.

విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ విజయానికి కర్త-కర్మ-క్రియ కూడా సాయిరెడ్డే. ఈ క్రమంలోనే గత ఎన్ని కల్లో ఆయన ఎంపీ సీటు దక్కించుకున్నారు. అయితే.. అంతర్గత రాజకీయాల కారణంగా.. సాయిరెడ్డి పార్టీ కి దూరమయ్యారు. దీనికి కొందరు నాయకులు కారణమని ఆయన చెప్పుకొచ్చారు. కానీ, జగన్‌పై మాత్రం ఎప్పుడూ ఆయన విమర్శలు చేయకపోవడం గమనార్హం. అంటే.. జగన్‌పై ఆయనకు మంచి అభిప్రాయ మే ఉంది. దీంతో ఇప్పుడున్న పరిస్థితిలో విశాఖలో పార్టీ పుంజుకోవాలంటే.. సాయిరెడ్డి వ్యూహాలు అవస రమని జగన్ భావిస్తున్నారు.

దీంతో జగనే స్వయంగా సాయిరెడ్డికి ఆహ్వానం పంపుతున్నారన్న వాదన వినిపిస్తోంది. అయితే.. సాయిరె డ్డి ఆలోచన ఎలా ఉందో చూడాలి. ఒకవేళ ఆయన వైసీపీలోకి వచ్చినా.. తనకంటూ కొత్త టీమ్‌ను ఏర్పాటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడున్న నాయకులకు .. సాయిరెడ్డికి మధ్య విభేదాలు ఉన్న నేప థ్యంలో ఒకవేళ ఆయన వైసీపీలోకి వస్తే.. ఎలాంటి వ్యూహం అనుసరిస్తారన్నది చూడాలి. ఇక, మరో నాయ కుడు.. తాజాగా కూడా ఆయన ఎంట్రీపై జగన్ చూచాయగా వ్యాఖ్యానించిన నేత.. ఆమంచి కృష్ణమోహన్‌. చీరాల మాజీ ఎమ్మెల్యే.

ప్రస్తుతం కృష్ణమోహన్‌.. కాంగ్రెస్‌లో ఉన్నారు. కానీ.. అనుకున్న రేంజ్‌లో ఆయనకు గుర్తింపు లేదు. పైగా.. పార్టీ పుంజుకునే అవకాశం కూడా కనిపించడం లేదు. అలాగని.. వేరే పార్టీలోకి వెళ్లేందుకు అవకాశం లేదు. ఈ నేపథ్యానికి తోడు.. చీరాల వైసీపీలో ఎవరూ యాక్టివ్‌గా లేకపోవడం కూడా.. ఆమంచికి కలిసి వస్తోంది. ఇక, వైసీపీ పరంగా చూసుకుంటే.. కాపు సామాజిక వర్గాన్ని తిరిగి యాక్టివ్ చేసుకునేందుకు ఆమంచి వంటి వారిని చేరదీయడమే బెటర్ అన్నట్టుగా జగన్ భావిస్తున్నారు. ఈ క్రమంలో వీరిద్దరూ కూడా తిరిగి పార్టీలోకి వస్తారన్న చర్చ జోరుగా సాగుతోంది. మరి ఎప్పటికి వారు వస్తారో చూడాలి.

Exit mobile version