స్థానిక సంస్థల ఎన్నికల కు సిద్ధంకండి.. బిజెపి శక్తి చాటి చెప్పండి
కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో చెంపపెట్టు లాంటి తీర్పు రాబోతుంది
బి ఆర్ఎస్ అవుట్ డేటెడ్ పార్టీ.. ఆ పార్టీకి ఓటు వేయడం దండగ
బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి
*జమ్మికుంట ఇల్లందకుంట జులై 27 ప్రశ్న ఆయుధం*
స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని , ఎన్నికల్లో బిజెపి శక్తి చాటి చెప్పాలని బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం రోజున ఇల్లందకుంట మండలంలోనీ శ్రీరాములపల్లిలో ప్రధాని మన్ కి బాత్ కార్యక్రమాన్ని స్థానిక బూత్ కార్యకర్తలతో కలిసి గంగాడి కృష్ణారెడ్డి వీక్షించారు. ప్రోగ్రాం అనంతరం బిజెపి శ్రేణులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం అడ్డగోలు వాగ్దానాలు, హామీలు ఇచ్చిందన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ చెప్పిన 6 గ్యారంటీలు, 420 హామీలను విస్మరించిందన్నారు. అనతి కాలంలోనే తీవ్ర ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ రేవంత్ రెడ్డి దేనన్నారు. అందుకే త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి దిమ్మ తిరిగే ఫలితాలు వస్తాయని, చెంపపెట్టు లాంటి తీర్పు రాబోతుందని ఆయన జోస్యం చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల తో కాంగ్రెస్ గ్రాఫ్ పూర్తిగా పడిపోతుందన్నారు. ఇక బిఆర్ఎస్ అవుట్ డేటెడ్ పార్టీ అని ఆ పార్టీకి ఓటు వేయడం దండగానే అభిప్రాయం ప్రజల్లో ఉందని తెలిపారు. ప్రజలంతా బిజెపి వైపు చూస్తున్నారని , జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి ప్రభంజనం సృష్టిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమం లో ఇల్లందకుంట మండల అధ్యక్షుడు బైరెడ్డి రమణారెడ్డి ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్, హుజరాబాద్ పట్టణ అధ్యక్షుడు తూర్పాటి రాజు, జిల్లా కార్యవర్గ సభ్యులు ఉప్పుల రమేష్, జిల్లా కౌన్సిల్ సభ్యుడు గుత్తికొండ రాంబాబు, మండల నాయకులు ఇంగ్లే భారతి, తడిగోప్పుల రమేష్, నల్ల లింగారెడ్డి,రావుల విజయ్, మట్ట పవన్, తాళ్ల పాపిరెడ్డి,ఇంగ్లే రమేష్, తిప్పరబోయిన సమ్మయ్య, శీలం సాయి ప్రసాద్ రెడ్డి,కౌడగాని వనజ, సానవేన శ్రీను, సారయ్య, ఆసాల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు