ఫోర్త్ సిటీ తో భవిష్యతులో రాష్టం ప్రపంచ నగరంగా గుర్తింపు

ఫోర్త్ సిటీ తో భవిష్యతులో రాష్టం ప్రపంచ నగరంగా గుర్తింపు

IMG 20250126 WA0098

ఆయుధం జనవరి 26: కూకట్‌పల్లి ప్రతినిధి

” వ్యాపార వేత్తలకు పెట్టుబడులకు బెస్ట్ ప్లేస్ తెలంగాణ రాష్టం”

” ఫోర్త్ సిటీ తో భవిష్యతులో ఈ రాష్టం ప్రపంచ నగరంగా గుర్తించబడుతుంది.

SEA సనాతన ఎంట్రెప్రినేటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నోమా కన్వేషన్ హాల్ నాచారం లో నిర్వహించిన బిజినెస్ మీట్ అండ్ ఎక్స్పో 2025 కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన టీపీసీసీ అధికార ప్రతినిధి, ఈ సందర్బంగా సత్యం శ్రీరంగం మాట్లుడుతూ ప్రజా ప్రభుత్వం విధానాలతో రాష్టానికి భారీగా పెట్టుబడులు, దావోస్ లో రికార్డ్ స్థాయిలో 1,78,950 కోట్లు పెట్టుబడులు సాధించాం. పారిశ్రామికవేత్తలను ఆకట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఫ్యూచర్ సిటీ (ఫోర్త్ సిటీ), పెట్టుబడులకు దోహదపడ్డ యంగ్ ఇండియా సిల్క్ యూనివర్సిటీ, ఈ పెట్టుబడులతో 49,500 మందికి ఉద్యోగావకాశాలు వస్తాయని అన్నారు. వ్యాపార వేత్తలకు తెలంగాణ రాష్టం ఒక భూతల స్వర్గం అని అన్నారు. రాష్ట భవిష్యతు కోసం నిరంతరం శ్రమిస్తున్న ప్రభుత్వం అని అన్నారు. ఈ కార్యక్రమంలో SEA జాతీయ టీమ్, తెలంగాణ టీమ్, బోర్డు అఫ్ ట్రస్టీస్ మరియు పెద్ద ఎత్తున వ్యాపార వేత్తలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now