కష్టపడి పని చేసిన వారికి పార్టీ
తగిన గుర్తింపు ఇస్తుందని _ పట్నం సునీత మహేందర్ రెడ్డి.
ప్రశ్న ఆయుధం వార్తలు సెప్టెంబర్ 27: కూకట్‌పల్లి ప్రతినిధి
కష్టపడి పని చేసిన వారికి పార్టీ గుర్తింపు
పదవులు లభించిన వారు ఒదిగి ఉండాలి
పదవులు లభించిన వారు ఆదర్శంగా పనిచేయాలి
ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
6 గ్యారంటీల అమలే ప్రభుత్వ లక్ష్యం
మల్కాజ్ గిరి పార్లమెంట్ ఇంచార్జ్ పట్నం సునీత మహేందర్ రెడ్డి, కూకట్పల్లి ఇంచార్జి బండి రమేష్.
కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి పార్టీ తగిన గుర్తింపు ఇస్తుందని మల్కాజ్గిరి పార్లమెంట్ ఇంచార్జ్ పట్నం సునీత మహేందర్ రెడ్డి అన్నారు. కూకట్పల్లి నియోజకవర్గానికి చెందిన మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ డైరెక్టర్లు శుక్రవారం పదవి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా పలు పదవులు లభించిన వారికి పట్నం సునీత మహేందర్ రెడ్డి అభినందించారు. అనంతరం పట్నం సునీత మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ఏ పార్టీ కైనా కార్యకర్తలే ప్రధానమని పార్టీ అభివృద్ధి కోసం కష్టపడి పని చేసిన వారికి కాంగ్రెస్ పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందని ఈ సందర్భంగా తెలిపారు. పదవులు వచ్చిన వారు ఎంత ఎదిగిన ఒదిగి ఉండే నేపథ్యాన్ని అలవర్చుకొని ముందుకు సాగాలని తద్వారా వారి అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. పదవులు రాని వారు సైతం నిరాశకు గురి కావద్దని త్వరలోనే అర్హులైన నేతలకు పదవులు ఇప్పించడానికి తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పదవుల పొందిన వారికి అవకాశం ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేయాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేసిందని ఆ విషయాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లు క్రింది స్థాయి ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో భాగంగా ఇప్పటికే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 500 రూపాయలకే అర్హులైన వారికి సబ్సిడీపై గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల లోపు ఉచితంగా కరెంటు ఇవ్వడం జరుగుతుందన్నారు. 5 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీని 10 లక్షల రూపాయలకు పెంచడం జరిగిందన్నారు. త్వరలోనే మిగిలిన హామీలు సైతం ప్రభుత్వం పూర్తి చేయగలదని తెలిపారు ప్రతి ఒక్కరూ పార్టీ పటిష్టత కోసం కృషిచేసి ప్రజలకు సేవలందించాలని సూచించారు. కార్యక్రమంలో కూకట్ పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు శేరి సతీష్ రెడ్డి.