క్లెయిమ్ చేయని ఆస్తులు తిరిగి పొందండి
“మీ డబ్బు – మీ హక్కు” ప్రచారాన్ని సద్వినియోగం చేసుకోవాలి
జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
కామారెడ్డి జిల్లా ప్రతినిధి,ప్రశ్న ఆయుధం డిసెంబర్ 20:
క్లెయిమ్ చేయని ఆర్థిక ఆస్తుల సెటిల్మెంట్ కోసం కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న “మీ డబ్బు – మీ హక్కు” ప్రత్యేక ప్రచారాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కోరారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించిన అవగాహన, సేవల శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ ప్రచారం ద్వారా అన్‌క్లెయిమ్ బ్యాంక్ డిపాజిట్లు, బీమా, షేర్లు, మ్యూచువల్ ఫండ్లు తిరిగి పొందవచ్చని తెలిపారు. RBI ఆధ్వర్యంలోని UDGAM పోర్టల్ ద్వారా వివరాలు తెలుసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో నాబార్డు, ఎస్ఎల్బీసీ, బ్యాంకులు, ఎల్ఐసీ అధికారులు పాల్గొన్నారు.