*విలేఖరుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తా..*
-ఎర్ర యాకన్న.
ప్రశ్న ఆయుధం మార్చి 24: కూకట్‌పల్లి ప్రతినిధి
కూకట్పల్లి నియోజకవర్గంలోని విలేకరుల సమస్యల పరిష్కారం కొరకు తమ వంతు కృషి చేస్తానని కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎర్ర యాకన్న అన్నారు.కూకట్పల్లి వివేకానంద నగర్ ప్రాంతంలోని వడ్డేపల్లి కమలమ్మ భవనంలో జరిగిన ప్రెస్ క్లబ్ కార్యవర్గ సమావేశానికి ఆయన హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విలేకరుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి ప్రెస్ క్లబ్ కోశాధికారి పుట్టి నగేష్, జాయింట్ కార్యదర్శి నాగుల అంజిబాబు,జాయింట్ సెక్రెటరీ సుజాత,ఆర్గనైజింగ్ కార్యదర్శి లక్ష్మి, మీడియా సెల్ ఇంచార్జ్ దుర్గాప్రసాద్, సభ్యులు రవీందర్ రెడ్డి, బెల్లం శంకర్, ప్రభాకర్ రెడ్డి, చంద్రశేఖర్, వినీల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.