*రెడ్డి సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ కర్ర అనిల్ కుమార్ రెడ్డి*
*కరీంనగర్ ప్రశ్న ఆయుధం న్యూస్ బ్యూరో సెప్టెంబర్ 17*
తెలంగాణ రాష్ట్ర రెడ్డి సంఘం ఐక్యవేదిక రాష్ట్ర యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కర్ర అనిల్ కుమార్ రెడ్డిని నియమించినట్లు రాష్ట్ర యూత్ ప్రెసిడెంట్ ఎలిమినేటి సుమన్ రెడ్డి నియామక పత్రంను మంగళవారం రోజున హైదరాబాదులో అందజేశారు దీని పదవి కాలం రెండు సంవత్సరాలు ఉంటుందని రెడ్డి సంఘం ఐక్యవేదిక అభ్యున్నతికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సంఘ కార్యకలాపాలకు తోడ్పాటును అందిస్తూ రెడ్డి జాతి రాజకీయ సామాజిక అభివృద్ధి కొరకు రాష్ట్ర కార్యవర్గ నియమావళికి లోబడి పాటుపడాలని కోరారు ఈ సందర్భంగా కర్ర అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నా నియమకానికి కృషి చేసిన రాష్ట్ర యూత్ రెడ్డి సంఘానికి పెద్దలకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని వారు ఇచ్చిన బాధ్యతలను తూచా తప్పకుండా పాటిస్తూ రెడ్డి సంఘము యొక్క అభివృద్ధికి తోడ్పడతానని అన్నారు ఈ కార్యక్రమంలో రెడ్డినాయకులు పాల్గొన్నారు