Site icon PRASHNA AYUDHAM

రీజినల్ రింగ్ రోడ్ భూసేకరణ పనులు వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

IMG 20250807 183504

Oplus_0

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 7 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా పరిధిలో నిర్మించబోయే రీజినల్ రింగ్ రోడ్ భూసేకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా గిర్మాపూర్ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వరకు. మొత్తం ఐదు ప్యాకేజీలుగా ఈ రహదారిని నిర్మించనున్నారు. దీని కోసం సంగారెడ్డి జిల్లా పరిధిలో భూమిని సేకరించాలని నిర్ణయించారు. గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య, జిల్లా అధికారుల నుండి రీజినల్ రింగ్ రోడ్డు భూ సకరణ పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతులకు న్యాయమైన పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రీజినల్ రింగ్ రోడ్డు భూసేకరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ మాధురి, ఆందోల్ ఆర్డీవో పాండు, గజ్వేల్ మేనేజర్ నేషనల్ హైవే అథారిటీ మేనేజర్ శ్రీహరి, ఆర్అండ్ బీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version