కేటీఆర్ పై కేసు నమోదు హేయమైన చర్య…

కేటీఆర్ పై కేసు నమోదు హేయమైన చర్య…

– ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక కక్ష సాధింపుకు పాల్పడుతోంది.

– బిఆర్ఎస్ నేతల పై బనాయించిన అక్రమ కేసులు వెంటనే రద్దు చేయాలి.

– ఓదెల బిఆర్ఎస్ పార్టీ యూత్ మండల అధ్యక్షులు-మ్యాడగోని శ్రీకాంత్ గౌడ్.

సుల్తానాబాద్, డిసెంబర్-20 (ప్రశ్న ఆయుధం ): ఓదెల బిఆర్ఎస్ పార్టీ యూత్ మండల అధ్యక్షులు మ్యాడగోని శ్రీకాంత్ గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ,గత ఎన్నికల్లో ప్రజలకు సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారం లోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని నెరవేర్చలేక ప్రజల్లో వస్తున్న ఆగ్రహాన్ని పక్క దారి పట్టించేందుకు డైవర్షన్ పాలిటిక్స్ కు తెర లేపారని, ఇందులో భాగంగానే బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ పై అక్రమ కేసులు పెట్టారని, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ ఆటవిక పాలన సాగిస్తుందని ధ్వజమెత్తారు. ఆరు గ్యారెంటీ పథకాలు అమలు చేయలేక ప్రతిపక్ష పార్టీ నేతలపై తప్పుడు కేసులు బనాయించి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు.ప్రజల్లో కేటీఆర్ కు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక తప్పుడు ప్రచారంతో అయన వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారని, విజ్ఞులైన తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోరని, రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Join WhatsApp

Join Now