ప్రశ్న ఆయుధం న్యూస్ డిసెంబర్ 20 (మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)
అర్ధరాత్రి ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి అదృశ్యమైన ఘటన మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలో చోటుచేసుకుంది.ఎస్సై మధుకర్ రెడ్డి తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని సికిండ్లపూర్ పిట్టల వాడకు చెందిన విక్రమ్ (30) మొన్న రాత్రి భార్యా పిల్లలతో కలిసి భోజనం చేసి నిద్రించారు. ఉదయం లేచేసరికి కనిపించకుండా పోయినట్లు తెలిపారు. పలు చోట్ల వెతికిన ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.