*నేడు ఇంటర్మీడియట్ హాల్ టికెట్ విడుదల*
అమరావతి:ఫిబ్రవరి 20
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తం గా 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1535 సెంటర్లలో ఈ పరీక్షలు నిర్వహించను న్నారు.
మార్చి 1వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష లు, అలాగే మార్చి 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలు నిర్వహించను న్నట్లు ఇప్పటికే ఇంటర్ బోర్డు షెడ్యూల్‌ను కూడా విడుదల చేసింది. ఇక జనరల్ పరీక్షలు మార్చి 15వ తేదీతో ముగియను న్నాయి.
ఫిబ్రవరి 5వ తేదీ నుంచి నిర్వహిస్తున్న ప్రాక్టికల్ పరీక్షలు నేటితో ముగు స్తాయి. ఈ ఏడాదికి ఇంటర్ పరీక్షలకు మొత్తం 10,58, 893 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది.
మొత్తం విద్యార్ధుల్లో మొద టి సంవత్సరం జనరల్ విద్యార్థులు 5,00,963 మంది, ఒకేషనల్ విద్యా ర్థులు 44,581 మంది ఉన్నారు. మొత్తం విద్యార్ధు ల్లో జనరల్ విద్యార్థులు 4,71,021 మంది, ఒకే షనల్ విద్యార్థులు 42,328 మంది ఉన్నారు.
ఇక ఇంటర్ పరీక్షలకు ఈ రోజు నుంచి హాల్‌టికెట్లు పంపిణీకి ఇంటర్ బోర్డు ఏర్పాట్లు చేసింది. పరీక్షల నిర్వహణకు గత ఏడాది అనుసరించిన విధానాలనే ఈసారి కూడా అమలు చేస్తున్నట్లు బోర్డు పేర్కొంది. పరీక్షలు జరిగే అన్ని గదుల్లో సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు.