సంగారెడ్డి/పటాన్ చెరు, జూలై 28 (ప్రశ్న ఆయుధం న్యూస్): ఇంద్రేశం, జిన్నారం మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. ఈ మేరకు రూపొందించిన గెజిట్ నోటిఫికేషన్ ను సోమవారం ప్రకటించారు. ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలో బచ్చుగూడెం, చిన్నకంజర్ల, ఐనోలు, లక్డారం, పెద్దకంజర్ల, రామేశ్వరం బండ, రుద్రారం గ్రామాలను చేర్చారు. అదేవిధంగా జిన్నారం మున్సిపాలిటీ పరిధిలో జంగంపేట, ఊట్ల, మంగంపేట, సోలక్ పల్లి, అండూరు, శివానగర్, రాళ్లకత్వ, కొడకంచి, నల్తూరు గ్రామాలు నూతన మున్సిపాలిటీలో విలీనం కానున్నాయి. గ్రామ పంచాయతీలను విలీనం చేయాలని గత జూన్ 23న జరిగిన క్యాబినెట్ మీటింగ్ లో ప్రభుత్వం నిర్ణయించింది.
ఇంద్రేశం, జిన్నారం మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ గెజిట్ విడుదల
Published On: July 28, 2025 9:28 pm