మీడియా రంగంలో విస్తరిస్తున్న రిలయన్స్‌

మీడియా
Headlines :
  1. “రిలయన్స్ మీడియా రంగంలో విస్తరణ: సీసీఐ అడ్డంకులు”
  2. “సీసీఐ చర్యలపై ప్రశ్నలు: రిలయన్స్ డిస్నీ ఒప్పందం”
  3. “రిలయన్స్ మీడియా విస్తరణ: పోటీతత్వానికి ముప్పు?”

చేష్టలుడిగి చూస్తున్న సీసీఐ

కాలంలో మీడియా రంగంలో విలీనాలు, భాగస్వామ్య ఒప్పందాలు పెద్ద ఎత్తున జరిగిపోతున్నాయి. దేశంలో పోటీతత్వాన్ని ప్రోత్సహించేందుకు, పోటీపై ప్రభావం చూపే కార్యకలాపాలను నియంత్రించేందుకు 2003లో ఏర్పడిన కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) చేష్టలుడిగి చూస్తూండి పోవడంతో విలీనాలు, ఒప్పందాలు అడ్డూ అదుపూ లేకుండా సాగుతున్నాయి. ఉదాహరణకు రిలయన్స్‌ ఇండిస్టీస్‌ లిమిటెడ్‌ (ఆర్ఐఎల్‌)నే తీసుకుందాం. అది ఓ పారిశ్రామిక గ్రూపు. కానీ ఇప్పుడు మీడియా రంగంలో విస్తరిస్తోంది. ఇందుకు దేశాన్ని పరిపాలిస్తున్న ప్రభుత్వాలే కారణం. మీడియా రంగంలో ఆర్ఐఎల్‌ విస్తరణ సీసీఐ బలహీనతకు అద్దం పడుతోంది.

ఇటీవల ఆర్ఐఎల్‌, అతి పెద్ద అంతర్జాతీయ మీడియా సంస్థ డిస్నీకి చెందిన భారతీయ విభాగం చేతులు కలిపాయి. దేశంలోని వివిధ మీడియా సంస్థలను కొనుగోలు చేయడం, వాటితో ఉమ్మడి భాగస్వామ్యాన్ని నెలకొల్పుకోవడం లేదా వాటిలో విలీనం కావడం… పేరు ఏదైనా ఈ రంగంలో రిలయన్స్‌ వేళ్లూనుకుపోతోందని చెప్పడానికి ఇవి ఉదాహరణలు.

తాజాగా ఆర్ఐఎల్‌, వయాకామ్‌ 18, డిస్నీ చేతులు కలిపాయి. నూతన సంస్థలో వీటికి వరుసగా 16 శాతం, 46 శాతం, 36 శాతం వాటాలు ఉన్నాయి. కానీ ఇది రిలయన్స్‌ నియంత్రణలోనే ఉంటుంది. ఎందుకంటే వయాకామ్‌ 18లో మెజారిటీ వాటాలు రిలయన్స్‌వే. వాస్తవానికి గత దశాబ్ద కాలంగా మీడియా, కమ్యూనికకేషన్‌ పరిశ్రమలలో ఆర్ఐఎల్‌ విస్తరిస్తూనే ఉంది. 2012లో టీవీ ప్రసారాలలో ప్రవేశించింది. బహు భాషా వ్యవస్థలను కలిగిన టీవీ-18, ఈటీవీని చేజిక్కించుకుంది. టీవీ వినోద విభాగంలో ముఖ్య భూమిక పోషిస్తున్న వయాకామ్‌ 18 యాజమాన్యం కూడా రిలయన్స్‌ చేతికే వచ్చింది. అయినప్పటికీ వార్త, వినోద విభాగాలలో ప్రత్యర్థి నెట్‌వర్క్‌ల ప్రాభవం ఏ మాత్రం మసకబారలేదు. అయితే ఇటీవలి ఒప్పందంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

2023లో దేశంలో మొదటి పది స్థానాలలో నిలిచిన ప్రసార సంస్థలలో వయాకామ్‌ 18, డిస్నీ 40 కూడా ఉన్నాయి. మొత్తం ప్రేక్షకులలో ఈ రెండింటి వాటా కలిపి 40 శాతం దాటింది. 2016లో రిలయన్స్‌ ఇండిస్టీస్‌ జియోని ప్రారంభించడం ద్వారా మొబైల్‌ టెలీకమ్యూనికేషన్స్‌ రంగంలో అడుగు పెట్టింది. ప్రభుత్వ లోపభూయిష్ట విధానాల కారణంగా జియో సామ్రాజ్యం విస్తరించింది. మొబైల్‌ టెలీకమ్యూనికేషన్‌ లైసెన్స్‌ పొందిన తర్వాత జియో ఇతర మొబైల్‌ ప్రొవైడర్ల నుండి వినియోగదారులను దూరం చేసింది. అటు సీసీఐ కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో పడిపోయింది. రిలయన్స్‌, డిస్నీ సంస్థలకు సీసీఐ 100 ప్రశ్నలు సంధించినప్పటికీ అవి ఏమిటో, వాటికి ఆ సంస్థలు ఇచ్చిన సమాధానమేమిటో ఎవరికీ తెలియదు. తాజాగా మూడు సంస్థల మధ్య కుదిరిన భాగస్వామ్య ఒప్పందంతో వాటికి మార్కెట్‌పై పూర్తి ఆధిపత్యం వచ్చింది.

జియో జియో సినిమా, వయాకామ్‌ 18కి చెందిన వూట్‌, డిస్నీ హాట్‌స్టార్‌…ఆ మూడూ ప్రస్తుత వినియోగదారులలో 30 శాతం మందిని తమ వైపు తిప్పుకున్నాయి. వయాకామ్‌ 18, డిస్నీ సంస్థలు తమ వినియోగదారుల కోసం రూపొందించిన ఆన్‌లైన్‌ వీడియో కార్యక్రమాలను రిలయన్స్‌ తన జియో ద్వారా ప్రసారం చేస్తోంది. మీడియా రంగంలో భాగస్వామ్యాల ప్రభావంపై దర్యాప్తు చేయాల్సిన సీసీఐ ఆ పనిని ఇంకా ప్రారంభించలేదు. ఇటీవలి కాలంలో వయాకామ్‌ 18, డిస్నీ కలిసి టీవీ ప్రకటనల విభాగంలో 45 శాతం వాటా సంపాదించాయి.

Join WhatsApp

Join Now