ఉపాధి హామి కూలీల హక్కుల ను పరిరక్షించండి.
కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శికి ఎన్ ఎస్ యం విన్నపం
జాబ్ కార్డుల తొలగింపు అన్యాయం
డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్
సిద్దిపేట ఆగస్టు 5 ప్రశ్న ఆయుధం :
జాతీయ గ్రామీణ ఉపాధి హమి హక్కులను పరిరక్షించాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి బృందానికి నరేగ సంఘర్షణ సమితి జాతీయ బృందం విన్నవించింది. సోమవారం నాడు డిల్లీ లోని కృషిభవన్ లోని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాలయం లోఆరుగురి అధికార బృందం తో వివిధ రాష్ట్రాలకు చెందిన వివిధ దళిత,ప్రజా,కార్మిక సంఘాలకు చెందిన 15 మంది బృందం సుధీర్ఘంగా చర్చించింది. ఈ సందర్భంగా దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ మాట్లాడుతూ ఏడు డిమాండ్ లను కేంద్ర ప్రభుత్వం దృష్టి కి తీసుకెళ్ళగా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి శైలెష్ కుమార్ సింగ్ సానుకూలంగా స్పందించారన్నారు. తెలంగాణ తో పాటు దేశ వ్యాప్తంగా గత రెండు నెలలు్అ వున్న పెండింగ్ వేతనాలను యుద్దప్రాతిపాదికన చెల్లించాలని,పెండింగ్ వేతనాలకు నష్టపరిహారం చె కోరగా త్వరగా చెల్లిస్తామని హమి ఇచ్చారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు పెంచాలని కోరగా పరిశీలిస్తామని చెప్పారు. గతంలో రాష్ట్రాలకు ఇచ్చిన విధంగా కార్ఫస్ నిధులు ఇస్తే వేతనాలు పెండింగ్ కాకుండా వుంటాయని గుర్తు చేసామన్నారు.కూలీల పని దరఖాస్తులను ఆన్లైన్ లో నమోదు చేసి గ్రామ పంచాయతిలో రశిదు ఇవ్వాలని కొరగా చర్యలు తీసుకుంటామని హమి ఇచ్చారని తెలిపారు. జాబ్ కార్డులలో ఎప్పటికప్పుడు పని దినాలను నమోదు చేయాలని విన్నవించాగా సానుకూలంగా స్పందించారని శంకర్ వివరించారు. మ్యానువల్ మస్టర్ రోల్ ను సైతం నిర్వహించాలని కోరామన్నారు. ఉపాధి చట్టాన్ని కి విరుద్ధంగా దేశవ్యాప్తంగా తొలగించిన 8.7 కోట్ల జాబ్ కార్డులను తిరిగి ఇవ్వాలని ,కూలీల ఆమొదం లేకుండా జాబ్ కార్డులను తోలగించ వద్దనిడిమాండ్ చేయగా అధికారులు సానుకూలంగా స్పందించారని తెలిపారు. తెలంగాణ లో 5 లక్షలకు పైగా జాబ్ కార్డులను తోలగించడం అన్యాయమని శంకర్ ప్రశించారు.సామాజిక తనిఖీ విభాగాలను పటిష్ఠం చేయాలని ,తగిన నిధులను ఇవ్వాలని,అవినితిని ఆరికట్టెందుకు చర్యలు తీసుకొవాలని డిమాండ్ చేశామని శంకర్ తెలిపారు. పనిదినాలను వంద నుండి రెండు వందల రోజులకు,కనీస వేతనాన్ని 600 రూపాయలకు పెంచాలని కొరామన్నారు.కేంద్ర బడ్జెట్ ను సవరించి.1.50 కోట్ల ను కేటాయించాలని కోరగా ప్రభుత్వం దృష్టి కి తీసుక వెళ్ళుతమని అధికారులు హమి ఇచ్చారని శంకర్ తెలిపారు. గత రెండు సంవత్సరాలుగా అవినీతి పేరుతో పశ్చిమ బెంగాల్ లో నిలిపివేసిన ఉపాధి హమి పనులు తిరిగి ప్రారంభించాల ప్రజా సంఘాల ప్రతినిధులు ముక్త కంఠంతో డిమాండ్ చేశామని శంకర్ తెలిపారు. కేంద్రం బృందం తో చర్చలు జరిపిన వారిలో నరేగ సంఘర్షణ మోర్చా జాతీయ సమన్వయ కర్త అర్జున్, అనురాధ ( పశ్చిమ బెంగాల్) , ఆభయ్ (కర్ణాటక),అశిష్,రంజన్ (బీహార్) ముఖెష్ ( రాజస్ధాన్),పి.శంకర్, పులి కల్పన (డిబిఎఫ్, తెలంగాణ),రాహుల్ (ఎపి),రాజశేఖర్ (ఉత్తర ప్రదేశ్),నీతు ( గుజరాత్), తదితరులు పాల్గొన్నారని శంకర్ తెలిపారు. పిబ్రవరి లో డిల్లీ లో ధర్నా ఉపాధి హమి ,ఆహర భద్రత చట్టాల అమలు పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ వచ్చె పిబ్రవరి లో డిల్లీ లో ధర్నా నిర్వహించాలని నరేగ సంఘర్షణ మోర్చా,ఆహరభద్రత ప్రచారొద్యమ సంస్ధలు నిర్ణయించాయని డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ తెలిపారు. గత నాలుగు రోజులు గా డిల్లీ లో ఆగస్టు ,2,3,4 తేదీ లలో మూడు రోజుల పాటు జాతీయ సమావేశాలు జరిగాయని శంకర్ తెలిపారు. కేంద్ర బడ్జెట్ లో ఉపాధి హమికి, ఆహరభద్రత కు నిధులు పెంచాలని జాతీయ సమావేశాలలో తీర్మానించామని శంకర్ తెలిపారు. ఫిబ్రవరిలో జరగనున్న పార్లమెంటు సమావేశాల సందర్భంగా డిల్లీ లో మూడు రోజుల పాటు ధర్నా నిర్వహించాలని నిర్ణయించామని శంకర్ తెలిపారు.