*హైమదీబజార్‌లో అక్రమాల తొలగింపు*
రోడ్డు పైకి వచ్చిన దుకాణాలను తొలగించిన ట్రాఫిక్ పోలీసులు
నిజామాబాద్, నవంబర్ 6 (ప్రశ్న ఆయుధం)
నగరంలోని హైమదీబజార్ ప్రాంతంలో రోడ్లపైకి వచ్చి వ్యాపారాలు చేస్తున్న వ్యాపారులపై ట్రాఫిక్ పోలీసులు గురువారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. స్థానికంగా మటన్, చికెన్, ఫిష్ మార్కెట్లతో పాటు కూరగాయల వ్యాపారాలు రోడ్ల వరకూ విస్తరించడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.
ఈ నేపథ్యంలో ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, ట్రాఫిక్ సీఐ పి.ప్రసాద్ ఆధ్వర్యంలో అక్రమాలను తొలగించారు. దుకాణదారులు రోడ్డుపైకి వచ్చి వ్యాపారం నిర్వహించరాదని వారికి సూచనలు జారీ చేశారు. రహదారుల ఇరువైపులా ఏర్పడిన ఆక్రమాలను తొలగించి వాహనాల రాకపోకలకు మార్గం సుగమం చేశారు.
ఈ కార్యక్రమంలో టూ టౌన్ ఎస్‌ఐ ముజాహీద్, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.