Site icon PRASHNA AYUDHAM

కామారెడ్డిలో ఆర్టీఏ చెక్ పోస్టుల ఎత్తివేత

IMG 20251022 190317

కామారెడ్డిలో ఆర్టీఏ చెక్ పోస్టుల ఎత్తివేత

అవినీతికి అడ్డుకట్టగా ప్రభుత్వ నిర్ణయం 

 బారికేడ్లు, ఫర్నిచర్ తొలగింపు పూర్తి

కామారెడ్డి జిల్లా ప్రతినిధి ( ప్రశ్న ఆయుధం) అక్టోబర్ 22

 

అవినీతికి కేరాఫ్‌గా మారిన ఆర్టీఏ చెక్ పోస్టులను ఎత్తివేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రవాణాశాఖ కమిషనర్ ఉత్తర్వుల మేరకు పొందుర్తి, సలాబత్‌పూర్ చెక్ పోస్టులు పూర్తిగా తొలగించారు. అధికారులు బారికేడ్లు, బోర్డులు, ఫర్నిచర్, కంప్యూటర్లు తరలించారు. ఇటీవల ఏసీబీ దాడుల్లో అక్రమ వసూళ్లు బయటపడటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇకపై ఆర్టీఏ సేవలు ఆన్‌లైన్ www.transport.telangana.gov.in ద్వారా అందించనున్నట్లు జిల్లా రవాణాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

Exit mobile version