రోడ్లను మరమ్మతులు చేయండి
ప్రజల ప్రాణాలను కాపాడండి
మాలమహానాడు అధ్యక్షులు దాసరి శేఖర్
భద్రాచల పట్టణం లోరోడ్లపై గుంతలు ఏర్పడి ప్రజల ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉన్నందున రోడ్లను మరమ్మతులు చేసి ప్రజల ప్రాణాలను కాపాడండి అంటూ సంబంధిత అధికారులను జిల్లా మాల మహానాడు అధ్యక్షులు దాసరి శేఖర్ వేడుకున్నారు .గురువారం స్థానిక అంబేద్కర్ సెంటర్లో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దక్షిణా అయోధ్య గా పేరుగాంచిన భద్రాచల పట్టణంలో రోడ్లన్నీ గుంతల మయంగా ఏర్పడి భద్రాచలంకు వచ్చే లక్షలాది మంది యాత్రికులు ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని దేవుడు దర్శనానికి వచ్చే పరిస్థితి ఏర్పడిందని ,అదేవిధంగా స్థానిక ప్రజలు కూడా అనే ఇబ్బందులకు గురవుతున్నారు కావున సంబంధించిన అధికారులు సత్వరమే స్పందించి రోడ్లను మరమ్మతులు చేయించి ప్రజల ప్రాణాలను కాపాడండి అంటూ అధికారులను వేడుకుంటున్నాను.ఈ కార్యక్రమంలో సినిగిరి చిట్టిబాబు ,సిద్ది దేవయ్య ,సెనగ అర్జున్ ,అశోక్ ,రమణయ్య తదితరులు పాల్గొన్నారు