కారుణ్య నియామకాలను వెంటనే భర్తీ చేయండి

*జిల్లా పరిషత్ లోని కారుణ్య నియామకాలను వెంటనే భర్తీ చేయండి*

 

*రాష్ట్రంలోని 743 కారుణ్య ఖాళీలు ముఖ్యమంత్రికి కనపడకపోవడం బాధాకరం*

 

*బాధితులు 2014 నుండి వేచి చూస్తున్న ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం సిగ్గుచేటు*

 

*కారుణ్య ఖాళీలను భర్తీకి ప్రభుత్వం పై ఒత్తిడి తేవాలని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డికు బాధితుల వినతి*

 

*బీజేపీ రాష్ట్ర నాయకులు బేతి మహేందర్ రెడ్డి* 

 

*కరీంనగర్ ప్రశ్న ఆయుధం న్యూస్ బ్యూరో సెప్టెంబర్ 28*

 

తెలంగాణ రాష్ట్రం వస్తే కొత్తగా నియామకాలు చేపట్టి నిరుద్యోగ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఎన్నో ఆశలతో ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడి తెచ్చుకుంటే తెలంగాణలో కొత్త నియామకాలు చేపట్టకపోగా న్యాయ బద్దంగా రావాల్సిన కారుణ్య నియామకాలను కూడా గత టి.ఆర్.ఎస్ (బీఆర్ఎస్) ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం భర్తీ చేయకపోవడం బాధాకరమని బీజేపీ రాష్ట్ర నాయకులు బేతి మహేందర్ రెడ్డి అన్నారు. వివిధ కారణాలతో మృతి చెందిన జిల్లా పరిషత్ లోని ఉద్యోగుల కుటుంబాలలో ఒకరికి రావాల్సిన ఉద్యోగాలు 2014 సంవత్సరం నుండి 743 మంది కారుణ్య నియామకాలను భర్తీ చేయకుండా గత టి.ఆర్.ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేసారని ఈ ప్రధాన సమస్యను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి కారుణ్య నియామకాలను వెంటనే భర్తీ చేసేలా ప్రభుత్వం పై ఒత్తిడి తేవాలని కారుణ్య నియామకాల కోసం ఎదురు చూస్తున్న బాధితుల పక్షాన బీజేపీ రాష్ట్ర నాయకులు బేతి మహేందర్ రెడ్డి కామారెడ్డి కి వెళ్లి బీజేపీ ఎమ్మెల్యే కాటిపెల్లి వెంకటరమణ రెడ్డిని కామారెడ్డి లోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ లో కలిసి వినతి పత్రం ఇచ్చి తమ గోడును వెలిబుచ్చారు. బాధితుల ముందే ఎమ్మెల్యే కాటిపెల్లి వెంకటరమణ రెడ్డి వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి సమస్యను వివరించడంతో ముఖ్యమంత్రి వారం రోజుల్లోపు జిల్లా పరిషత్ లోని కారుణ్య నియామకాలను భర్తీ చేస్తానని ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డికి హామీ ఇవ్వడంతో సమస్య పరిష్కారం అవుతుందనే ఆశతో బాధితులు ఎదురుచూస్తున్నారని బేతి మహేందర్ రెడ్డి తెలిపారు. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కారుణ్య నియామకాలను భర్తీ చేయకపోతే ప్రభుత్వం పై నియామకాలు చేపట్టేదాకా తనే పోరాడుతానని బాధితులకు ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి భరోసా ఇచ్చారని బేతి మహేందర్ రెడ్డి తెలిపారు.

Join WhatsApp

Join Now