Site icon PRASHNA AYUDHAM

ఎస్సై సుమన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన విలేకరులు

IMG 20241011 WA2600

 

పాల్వంచ పోలీస్ స్టేషన్ నందు సబ్ ఇన్స్పెక్టర్ విధుల నిర్వహిస్తున్న సుమన్ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం బూర్గంపాడు మండలం విలేకరులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా విలేకరులు మాట్లాడుతూ… ఎస్ఐ సుమన్ గతంలో బూర్గంపాడు పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ విధులు నిర్వహిస్తూ ప్రజలకు ఉత్తమమైన సేవలు అందించారని కొనియాడారు. బూర్గంపాడు నుంచి బదిలీ అయ్యి టాస్క్ ఫోర్స్ ఎస్సై విధులను జిల్లాస్థాయిలో చాకచక్యంగా నిర్వహిస్తూ గంజాయి, పలు జూదాలు, ఇతర చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడంలో ఎంతో కృషి చేశారని వారు పేర్కొన్నారు. పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో ఆయన రానున్న రోజుల్లో మరింత ఉన్నత స్థాయికి చేరుకొని ప్రజలకు మరెన్నో సేవలు అందించాలని ఆకాంక్షిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎడారి రమేష్, అలవాల వంశీ, బబ్బు రాయుడు, చరణ్ లు పాల్గొన్నారు.

Exit mobile version