సంగారెడ్డి ప్రతినిధి, జనవరి 26 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని సన్ రైస్ ఆసుపత్రి వద్ద గణతంత్ర వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాములుగౌడ్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించి, వైద్య సిబ్బందికి, కాలనీవాసులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా స్వామిగౌడ్, సంతోష్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం జాతీయ పథకాలు ఎగరవేయడం ద్వారా ప్రజలకు దేశభక్తి పెంపొందడం జరుగుతుందని, హాస్పిటల్ వద్ద ప్రతి సంవత్సరం ఉచిత వైద్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు పేద ప్రజలకు ఉచితంగా మందులు సేవలు అందించడం ద్వారా గ్రామీణ ప్రాంతాలలో ఏర్పాటు చేసి ఉచితంగా మందులు ఇవ్వడం జరిగిందని డాక్టర్లు తెలిపారు. అధిక సంఖ్యలో కాలనీవాసులు పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ స్వామిగౌడ్, డాక్టర్ మల్లికా సంతోష్ గౌడ్, వైద్య సిబ్బంది, కాలనీ వాసులు పాల్గొన్నారు.
సంగారెడ్డి సన్ రైస్ ఆసుపత్రి వద్ద గణతంత్ర వేడుకలు
Published On: January 26, 2025 5:48 pm
