సంగారెడ్డి బిజెపి కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

సంగారెడ్డి ప్రతినిధి, జనవరి 26 (ప్రశ్న ఆయుధం న్యూస్): 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా సంగారెడ్డి జిల్లా బిజెపి కార్యాలయంలో జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి జాతీయ పతాకం ఎగర వేశారు. మెదక్ అదిలాబాద్ కరీంనగర్ నిజాంబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ బిజెపి అభ్యర్థి. సి.అంజిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సి.అంజిరెడ్డి మాట్లాడుతూ.. రాబోవు రోజుల్లో జరగబోయే పట్టభద్రుల ఎన్నికల్లో జనతా పార్టీ అభ్యర్థిగా ఆశీర్వదించాలని కోరారు. పట్టపద్దుల సమస్యలను ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా కచ్చితంగా కృషి చేస్తానని అన్నారు. అనంతరం గోదావరి అంజిరెడ్డి మాట్లాడుతూ.. భారత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న రోజని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా నిర్మాణం జరిగిన రోజుని స్వతంత్రం కోసం ఎందరో మహానీయులు ప్రాణ త్యాగం చేశారని, వారిని ఈ సందర్భంగా వారిని గుర్తు చేసుకుంటూ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు వెంకట నరసింహారెడ్డి, పోచారం రాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి కొలుకూరు రాజశేఖర్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు మందుల నాగరాజు, కసినివాసం డాక్టర్ రాజుగౌడ్, దోమల విజయ్ కుమార్, పుల్లంగారి సురేందర్, ద్వారక రవి, హర్షవర్ధన్ రెడ్డి, బసవరాజ్, పాటిల్, మల్లేశం, ప్రసాద్, తులసి రెడ్డి, దుర్గయ్య, సాయి రెడ్డి, అభినవ్ సదానంద చారి, నాయి కోటి రాములు, శ్రీకాంత్ రెడ్డి, నర్సారెడ్డి, రాంరెడ్డి, శ్రీకాంత్, జయపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now