*ఘనంగా మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు*
*ఇల్లందకుంట జనవరి 26 ప్రశ్న ఆయుధం*
మండల కేంద్రంలో ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ ప్రాంగణంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పెద్ది కుమార్ జాతీయ జెండాను ఎగురవేశారు అనంతరం మండలాధ్యక్షుడు కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా నాలుగు హామీలను అమలు పరచడం జరుగుతుందని వాటిలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇండ్లు రైతు భరోసా రేషన్ కార్డుల మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు భారతదేశానికి పూర్తి స్వాతంత్రం 1950 జనవరి 26న అమల్లోకి రావడం జరిగిందని తెలిపారు ఎంతోమంది త్యాగదనుల కృషితో స్వాతంత్ర్యం వచ్చి భారతదేశానికి నూతన రాజ్యాంగాన్ని నిర్మాణానికి కృషి చేసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు ఘన నివాళులు అర్పించారు వారి కృషితో భారతదేశంలోని ప్రతి పౌరుడు స్వేచ్ఛ వాతావరణం లో జీవించగలుగుతున్నాడని దానిని అనుకూలంగా సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన సాగుతుందని రైతులు మెచ్చే పాలను సాగిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు మండల అధ్యక్షుడు తో పాటు నాయకులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గూడెం సారంగపాణి సంజీవరెడ్డి తిరుపతి రవికుమార్ శివ రాజు మానస మహేష్ తిరుపతి రెడ్డి ఆయిల్ రెడ్డి దిలీప్ తదితరులు పాల్గొంటారు