సంగారెడ్డి ప్రతినిధి, జనవరి 26 (ప్రశ్న ఆయుధం న్యూస్): భారత జాతీయ గణతంత్ర దినోత్సవంను పురస్కరించుకుని పోతిరెడ్డిపల్లి సంగారెడ్డిలోని శ్రీ వేంకట సాయి ఫ్రెండ్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శంకరి విజయేందర్ రెడ్డి ఆధ్వర్యంలో 18 కుటుంబ సభ్యులు (36 మంది) వరంగల్, ములుగు జిల్లాల పరిధిలోని పర్యాటక ప్రాంతాలు వేయి స్థంభాల గుడి, భద్రకాళి, రామప్ప దేవాలయాలు, లక్నవరం లను దర్శించారు. ఈ సందర్భంగా ఎందరో వీరుల త్యాగ ఫలితమే ఈ రిపబ్లిక్ దినోత్సవం మరియు ఈనాడు మనం స్వేచ్చా వాయువులను పీలుస్తూ సుఖ జీవనముగా జీవిస్తున్నామని, అలాగే ఎన్నో పర్యాటక ప్రదేశాలను దర్శిస్తున్నామని అధ్యక్షుడు విజయేందర్ రెడ్డి అన్నారు. యుఎన్ఈఎస్ సీఓచే గుర్తింపు పొందిన వారసత్వ కట్టాడమైన దేవాలయము శ్రీ కాకతీ రుద్రేశ్వర (రామప్ప) దేవాలయంలో గణతంత్ర వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి మంగళపర్తి వెంకటేశం, సభ్యులు నాయికోటి రామప్ప, తెరుపల్లి అల్లంరెడ్డి, డి.నారాయణరెడ్డి, పి.ప్రకాష్, కే.సంగయ్య, యం.శ్రీనివాసరెడ్డి, పి.నారాయణరెడ్డి, పి.బస్వరాజ్, జి.వెంకన్న, ఏ.లక్ష్మా రెడ్డి, బి.శ్రీనివాస్, లక్ష్మారెడ్డి, యన్. కృష్ణారెడ్డి, శ్రీధర్, యం.విజయభాస్కర్, యన్.నర్దింహారెడ్డిలు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు