Site icon PRASHNA AYUDHAM

ఎస్సీ కులాల రిజర్వేషన్ అమలు చేయాలని మణుగూరు తహసిల్దార్ కు వినతి

IMG 20241107 WA02611

ప్రశ్న ఆయుధం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి నవంబర్

షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి మణుగూరు మండల కమిటీ ఆధ్వర్యంలో మణుగూరు మండల తాహసిల్దార్ కు వినతిపత్రం అందజేశారు. మణుగూరు పట్టణ సెంటర్ లో అంబేద్కర్ విగ్రహానికి, కొమరం భీం విగ్రహాలకు బొమ్మెర శ్రీనివాస్ పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. తొలగించిన ఏజెన్సీ ప్రాంత ఎస్సి కులాల స్థానిక రిజర్వేషన్లు తిరిగి అమలు చేయాలి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఎస్సీ కులాల జనాభా పెరిగినందున ఎస్సీ రిజర్వేషన్ 20 శాతం పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బొమ్మెర శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఏజెన్సీ ప్రాంత ఎస్సి కులాల జడ్పిటిసి ఎంపిటిసి రిజర్వేషన్ తొలగించడం వల్ల తీరని అన్యాయం జరిగిందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఇనుముల రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క దృష్టి పెట్టి హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నూతన రెవెన్యూ చట్టం తీసుకురావడం వల్ల ఏజెన్సీ ప్రాంత ఎస్సీ కులాల రైతులకు పంట రుణాలు పొందే అవకాశం పోయిందని అన్నారు. నూతన పంచాయతీ రాజ్ చట్టం తీసుకురావడం వల్ల జెడ్పిటిసి, ఎంపీటీసీ రిజర్వేషన్లు కోల్పోయినారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెన్సీ ప్రాంతలో ఇల్లు లేని పేదలు అధికం ఎస్సి కులాలకు ఇందిరమ్మ ఇల్లులు మంజూరు చేయాలని కోరారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అంబేద్కర్ రూ ,,12 లక్షలు నిరుద్యోగులకు,నిరుపేదలకు మొదటి ప్రాధాన్యత కల్పించాలని అన్నారు.ఎస్సీ రైతుల సాగు భూములకు,పోడు భూములకు ఆంక్షలు లేకుండా హక్కు పత్రాలు అందజేయాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంత ఎస్సి కులాలను ప్రజాపాలన ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర కోఆర్డినేటర్ ఎనగంటి కృపాకర్, జిమ్మిడి సడలమ్మ, మహిళ జిల్లా కన్వీనర్ నీలంపార్వతి, రాష్ట్ర నాయకులు కండే రాములు, ఇనుముల వెంకటేశ్వర్లు, నైనారపు నాగేశ్వరరావుబోయిల్లా నరసింహారావు, సింగరేణి ఉద్యోగుల సంఘం కాజీపేట కృష్ణ, ఎస్సీ ఎస్టీ వైస్ ప్రెసిడెంట్ శనిగారపు కుమారస్వామి, మాజీ ఎంపీటీసీ రావులపల్లి రామ్మూర్తి, తెల బిక్షపతి, లింగంపల్లి రమేష్, ఎస్సీ సెల్ మండల ప్రెసిడెంట్ మద్దెల భద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version