మాజీ మంత్రి ఎర్రబెల్లిపై,యాంకర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్సైకి వినతి..

మాజీ మంత్రి ఎర్రబెల్లిపై,యాంకర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్సైకి వినతి..

జనగామ జిల్లా దేవరుప్పుల మండలకేంద్రంలో ఉన్న పోలీస్ స్టేషన్ కు వెళ్ళి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై,సిగ్నేచర్ స్టూడియో యాంకర్ ఉపేందర్ లపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నల్ల శ్రీరామ్,కాసారపు ధర్మ రెడ్డి, ఓడపెల్లి రవి ,రెడ్డిరాజుల రమేష్ ,బోనగిరి యాకస్వామి ,పులిగిళ్ల వెంకన్న , దౌపాటి రవి,నర్సయ్య,దుద్దుల సత్తయ్య ,దావేర అనిల్ ,గుగులోతు రాజేందర్ ,తోటకూరి వెంకన్న ,గుగులోతు నరేందర్,నీలారపు మహేష్ ,బీసు అజయ్ ,కొంగరి ఉమేష్ ,కారుపోతుల విజయ్ ,లోడంగి అశోక్ ,మాసంపల్లి సాత్విక్ తదితరులు కలిసి దేవరుప్పుల మండల ఎస్సై ఊర సృజన్ కుమార్ కు వినతి పత్రాన్ని అందజేశారు.* పాలకుర్తి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే,మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రోద్బలంతో,అండదండలతో హైదరాబాద్ సిగ్నేచర్ స్టూడియోలో యాంకర్ గా పనిచేస్తున్న మహబూబాబాద్ జిల్లా,తొర్రూరు మండలం,వెలికట్ట గ్రామ శివారు తండాకు చెందిన ఉపేందర్ సిగ్నేచర్ స్టూడియోలో ఎలాంటి ఆధారాలు లేకుండా పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డిని,కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జి ఝాన్సీ రెడ్డిని అవమాన పరుస్తూ,కించపరిచే విధంగా, ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నాడని,నన్ను ఎవరు ఏం చేసినా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అండ ఉందని,నేను ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని,కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఝాన్సీ రెడ్డిని టార్గెట్ చేసి మాట్లాడుతానని,నన్ను ఎవరు ఏం చేసినా దయాకర్ రావు,హరీష్ రావు,కేటీఆర్ అండలు ఉన్నాయని,నాకు ఎలాంటి హాని జరిగినా వేలాదిమంది కార్యకర్తలతో మా నాయకులు రోడ్లపైకి వస్తారని,ఆర్భాటంగానే ఆడియో రికార్డింగ్ లలో ప్రకటించుకుంటున్నాడని,ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని,కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఝాన్సీ రెడ్డిలను కించపరిచే విధంగా రుజువు లేని అవినీతి నేరారోపణలు చేయిస్తూ మాట్లాడేందుకు ఉపేందర్ ను ఉసిగొలుపుచున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పై,సిగ్నేచర్ స్టూడియో యాంకర్ ఉపేందర్ లపై చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment