ప్రశ్న ఆయుధం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి నవంబర్
తెలంగాణ రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య కు షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బొమ్మెర శ్రీనివాస్ వినతి పత్రం అందజేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారుల రివీ సమావేశానికి వచ్చిన చైర్మన్ ను బొమ్మెర శ్రీనివాస్ బృందం కలిసి సమస్యలు వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రాష్ట్రంలో సగం భూభాగం ఏజెన్సీ ప్రాంతంలో ఎస్సీ కులాలకు టిఆర్ఎస్ ప్రభుత్వంలో స్థానిక రిజర్వేషన్ జడ్పిటిసి,ఎంపీటీసీ రిజర్వేషన్ జనరల్ లో కలపడం వలన ఏజెన్సీ ప్రాంత ఎస్సి కులాలకు తీరని అన్యాయం జరిగిందని తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఎస్సీ రైతులకు పంట రుణాలు పొందే అవకాశం లేకుండా పోయిందని, ఇల్లు లేని ఎస్సీ పేదలకు ఇల్లు ఇచ్చే అవకాశం లేకుండా తీరని అన్యాయం జరిగిందని కమిషన్ చైర్మన్ ముందు గోడువెలబుచ్చారు. స్పందించిన కమిషన్ ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకపోతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో షెడ్యూల్ కులాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర సీనియర్ నాయకులు గుడ్ల మోహన్ రావు దాసరి యాకయ్య, మంద వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.