*ఆడపిల్లలను ఆదుకొని తమకు న్యాయం చేయాలంటూ కలెక్టర్ కు వినతి పత్రానికి అందించిన వరదలకు నష్టపోయిన కుటుంబం సభ్యులు.*
ఖమ్మం : జూని బచ్చన్ కౌర్ వయసు (46) గత తొమ్మిది , పది సంవత్సరాల నుండి చిరు వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ జీవితం కొనసాగిస్తుంది . ఈ సంవత్సరం బొక్కల గడ్డ సమీపంలో ఓ స్థలాన్ని అద్దెకి తీసుకుని 5 లక్షల 50 వేల రూపాయల విలువ గల మట్టి వినాయక విగ్రహాలను విక్రయిస్తున్న సమయంలో అనుకోకుండా వచ్చిన వరదలకు వినాయకుని మట్టి విగ్రహాల కొన్ని వరదలో కొట్టక పోయాయి . మరికొన్ని కరిగిపోయాయి . తీరని భారీ నష్టం కలిగింది . ఆ భారీ మొత్తం అమౌంట్ను వడ్డీ రూపంలో అప్పుకు తీసుకొచ్చి వ్యాపారంలో పెట్టడం జరిగిందని అన్నారు . కుటుంబాన్ని పోషిస్తున్న జూని బచ్చన్ కౌర్ మట్టి విగ్రహాలు నష్ట పోవటం వలన ఆలోచన పెరిగి పోయి హటతుగా బీపీ పెరిగి మరణించ్చిందని , ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని , ఆమె చనిపోవడంతో వారి కుటుంబం రోడ్డున పడిందని కావున దయవుంచి అట్టి విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి తల్లి లేని ఆడపిల్లలకు న్యాయం జరిగేలా చూసి ప్రభుత్వం ఆదుకునే విధంగా చూడాలని కుటుంబ సభ్యులు జూని అశోక్ సింగ్ , జూని మీనా కౌర్ , జూని స్వప్న కౌర్ ,
జూని సంజన కౌర్ , సత్నం సింగ్ , చౌడపు నరేష్ లు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ను కోరారు . దానికి కలెక్టర్ సానుకూలంగా స్పందించి ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు అందేలా చూస్తామని అన్నారని బాధితులు పేర్కొన్నారు .