తొలగించిన ఎస్సీ కులాల జడ్పిటిసి, ఎంపీటీసీ రిజర్వేషన్ అమలు చేయాలిబొమ్మెర శ్రీనివాస్ షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి (ఎస్సిహెచ్బిఎస్) వ్యవస్థాపక అధ్యక్షులు బొమ్మెర శ్రీనివాస్ కొత్తగూడెం నుండి శనివారం ప్రకటన విడుదల చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో స్థానికంగా నివసిస్తున్న ఎస్సీ కులాల స్థానిక జెడ్పిటిసి, ఎంపీటీసీ వార్డు సభ్యుల రిజర్వేషన్ అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క లను కోరారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముందు ఏజెన్సీ ప్రాంత ఎస్సీ కులాలకు జడ్పిటిసి ఎంపీటీసీ వార్డు సభ్యులకు స్థానిక రిజర్వేషన్ ఉండేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఎస్సీ కులాల స్థానిక రిజర్వేషన్ 2019 సం,,లో బిఆర్ఎస్ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏజెన్సీ ప్రాంతంలో నూతన పంచాయతీ రాజ్ చట్టం తీసుకువచ్చి ఎస్టి, జనరల్ చేసి ఎస్సీ కులాలను జనరల్ లో కలపడం వలన తీరని అన్యాయం జరిగింది. ఉమ్మడి4 జిల్లాలు 86 మండలాలు సుమారు 10 లక్షల పైన జనాభా కలిగిన ఏజెన్సీ ప్రాంత ఎస్సి కులాల తరఫున ఒక్క ప్రజాప్రతినిధి లేకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. విద్య ఉద్యోగ ఉపాధి అభివృద్ధి పరంగా గతంలో ఐదు శాతం రిజర్వేషన్ కొనసాగిన దాఖలాలు ఉన్నాయని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకా ఏజెన్సీ ప్రాంత ఎస్సి కులాలను అన్యాయం చేయడం తగదని ప్రశ్నించారు. వెనుకబడ్డ ఏజెన్సీ ప్రాంతంలో అత్యధికంగా అభివృద్ధిలో వెనుకబడ్డది ఎస్సీ కులాలేనని తెలియజేశారు. ఏజెన్సీ ప్రాంత ఎస్సీ కులాలను గిరిజనేతరులుగా అభియోగం మోపి రాజ్యాంగపరమైన హక్కులకు దూరం చేయడం సరికాదన్నారు. ఇందిరమ్మ రాజ్యం ప్రజా పాలన ప్రభుత్వంలో ఏజెన్సీ ప్రాంత ఎస్సి కులాలకు గతంలో మాదిరిగా పంచాయతీ ఎన్నికల్లో స్థానిక జడ్పిటిసి, ఎంపీటీసీ, వార్డు సభ్యులకు రిజర్వేషన్ అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఎస్సీ కులాల జడ్పిటిసి ఎంపీటీసీల రిజర్వేషన్ అమలు చేయాలి
by admin admin
Published On: July 27, 2024 2:03 pm