ఈనెల 31న బీసీ రిజర్వేషన్ల సాధన యాత్ర ముగింపు సభ విజయవంతం చేయండి
కరీంనగర్ ప్రశ్న ఆయుధం బ్యూరో జులై 23
బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ నిర్వహిస్తున్న కామారెడ్డి టు కరీంనగర్ బీసీ రిజర్వేషన్ల సాధన యాత్ర ఈనెల 31న కరీంనగర్లో ముగింపు సమావేశానికి బీసీ అందరూ వచ్చి విజయవంతం చేయాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీసీ సంఘం అధ్యక్షుడు ఎన్నం ప్రకాష్ పిలుపునిచ్చారు మంగళవారం రోజున బిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కరీంనగర్ లోని పద్మావతి కళ్యాణ మండపంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నాగుల కనకయ్య గౌడ్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చెయ్యగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గీకురు రవీందర్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఎన్నం ప్రకాష్ హాజరై మాట్లాడుతూ గత శాసనసభ ఎన్నికలకు ముందు కామారెడ్డి లో జరిగిన బహిరంగ సభలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి మా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆరు నెలల లోపు సమగ్ర కుల గణన చేపట్టి బీసీ రిజర్వేషన్లను 27% నుండి 42 శాతానికి పెంచుతామని హామీ ఇచ్చారని బీసీల లెక్కలు తీయమంటే ప్రభుత్వానికి బాధ ఎందుకని ప్రశ్నించారు ఇచ్చిన మాట ప్రకారం బీసీల కుల గణన నిర్వహించి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని తెలిపారు. ఈ హామీని నెరవేర్చాలని జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ కామారెడ్డి టు కరీంనగర్ యాత్ర నిర్వహిస్తూ ఈనెల 31న కరీంనగర్లో జరిగే ముగింపు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు సమావేశానికి బీసీ కుల సంఘాల నాయకులు పార్టీల అతీతంగా బీసీ నాయకులు పాల్గొని విజయవంతం చెయ్యాలని కోరారు కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు కోడూరి పరుశురాం గౌడ్, రంగు సంపత్ గౌడ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాచర్ల అంజయ్య గౌడ్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి జి.ఎస్ ఆనంద్ జిల్లా ఉపాధ్యక్షులు పెంట శ్రీనివాస్ ఎడ్ల సురేందర్ ప్రచార కార్యదర్శి కాయితోజు బ్రహ్మచారి బీసీ యువజన సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసు సంజీవ్ బీసీ విద్యార్థి సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు రాకేష్ చారి, వంగల రవి గోపాల్ సుధాగోని గణేష్ గౌడ్ బీసీ మహిళా సంఘం జగిత్యాల జిల్లా అధ్యక్షురాలు గంగం జలజ ఎనుగుర్తి సరిత తదితరులు పాల్గొన్నారు