విద్యా ఉద్యోగలలో జనాభా ఆధారంగా రిజర్వేషన్లు అమలు చేయాలి

మేమెంతో మాకు అంత..

 

-విద్య ఉద్యోగలలో జనాభా ఆధారంగా రిజర్వేషన్లు అమలు చేయాలి

 

-రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు పిలుపు

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి 

(ప్రశ్న ఆయుధం) అక్టోబర్ 09:

 

టి డబ్ల్యూ ఎస్ రిజర్వేషన్ అమలు తీరు పై రౌండ్ టేబుల్ సమావేశం కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించడం జరిగింది.

భారతీయ విద్యార్థి మోర్చ రాష్ట్ర కార్యదర్శి జీవీఎం విట్టల్ అధ్యక్షతన సమావేశం నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా వక్తలు ఈ డబ్ల్యూ ఎస్ రిజర్వేషన్లు అగ్రవర్ణ పేదలకు మాత్రమే అమలు చేయాలి.కానీ 6 శాతం ఉన్న అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్లు ఏ ప్రాతిపదికంగా అమలు చేస్తున్నారో ప్రభుత్వలు ప్రకటించాలి.ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలు బిసి సమగ్ర కుల గణన చేసి రిజర్వేషన్ అమలు చేయాలని ఉద్యమాలు చేస్తుంటే

అగ్రవర్ణ పేదలు ఐదు శాతం ఉన్న వాళ్లకి 10 శాతం రిజర్వేషన్లు ఎలా అమలు చేస్తున్నారని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా బీసీ జనాభా 55 శాతం కన్నా ఎక్కువగా ఉంటే వారికి అమలు చేయాల్సిన రిజర్వేషన్లు అమలు చేయకుండా 27 శాతాన్ని అమలు చేసి బిసి కులాలకు సరైన న్యాయం చేయకుండా ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయని అన్నారు. రిజర్వేషన్ వల్ల కానిస్టేబుల్, డీఎస్సీ, ఎంబిబిఎస్ తదితర జాబు లలో బీసీ విద్యార్థులు చాలా నష్టపోయారన్నారు. స్థానిక ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి బీసీల రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పవలసిన వారు బీసీలకు వచ్చే రిజర్వేషన్లలో 

ఈ.డబ్ల్యూ.ఎస్. రిజర్వేషన్ అమలు చేయాలని కోర్టులో కేసు వేయడం తీవ్రంగా ఖండిస్తున్నాము, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఓట్లతో గెలిచిన మీరు వారికి ద్రోహం చేస్తున్నారని హెచ్చరించారు.బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తుంటే బీసీల రిజర్వేషన్లను గండి కొట్టాలని కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతున్నది.అని అన్నారు. ఆనాడు మండల్ కమిషన్ ప్రతిపాదనలు అమలు చేయకుండా ఉండడం వల్లనే బీసీలు విద్య, వైద్యం, ఉపాధికి, రాజకీయంలు దూరం అయ్యేలా చేస్తున్నారు అని అన్నారు. ప్రభుత్వాలు ఇప్పుడైనా ఆలోచించి ఈ.డబ్ల్యూ.ఎస్. రిజర్వేషన్ పై స్పష్టత ఇవ్వాలన్నారు. దీనిపై అన్ని బహుజన సంఘాలను కలుపుకొని కార్యచరణ ప్రకటిస్తామని తెలిపారు. ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి గారికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.బిసిలకు న్యాయం చేసే వరకు ఉద్యమం చేస్తామని ఉద్యమాల పురిటిగడ్డ కామారెడ్డి మరో ఉద్యమానికి పురుగు పోసుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల బాబు, బామ్ సేఫ్ రాష్ట్ర కార్యదర్శి దుబాయ్ నరేందర్, ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొంగలి వెంకటి,జిల్లా అధ్యక్షుడు యదన్న,బహుజన ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ క్యాతం సిద్ధిరాములు, జేఏసీ కన్వీనర్ జగన్నాథం, అంబేద్కర్ యువ సంఘం జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి గంగారం, అంబేద్కర్ సంఘం గౌరవ అధ్యక్షుడు కొత్తపల్లి మల్లన్న, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు శివరాములు, కురుమ సంఘం జిల్లా అధ్యక్షుడు భూమన్న, ధర్మ సమాజ పార్టీ జిల్లా కన్వీనర్ బోలేష్, అరవింద్, డిటియు జిల్లా అధ్యక్షుడు అశోక్, శంకర్, రజక సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రాజయ్య. భోగిడే సాయిలు, సురేందర్, సంగయ్య, లక్ష్మణ్, అర్బస్ ఖాన్, బబ్లు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now