ఎస్సీ జనాభా పెరిగిన దానికనుగుణంగా రిజర్వేషన్లు పెంచాలి..

IMG 20240829 WA1854

 

మాల మహానాడు చంద్రుగొండ మండలం అధ్యక్షులు బడుగు శంకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లా ఎంపీ శ్రీరామ సహాయం రఘురాం రెడ్డి కి ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగానికి అనుగుణంగా లేదని తీర్పును వెనకకు తీసుకోవాలని వర్గీకరణ వల్ల తలెత్తే సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ బిజెపి ఎస్సీల్లో ఉన్న 59 కులాల మధ్య జగడం పెడుతుందని దళితుల ఐక్యత, అంబేద్కర్ భావజాలానికి వ్యతిరేకంగా ఈ వర్గీకరణ ఉందని, ఈ వర్గీకరణ రాజ్యాంగంలో భాగంగా ఉన్న ఆర్టికల్ 341 ఆధారంగా చేసుకుని కొనసాగలేదని చట్టసభల్లో చర్చ లేకుండా నేరుగా తీర్పు ఎలా ఇస్తుందని వారు అన్నారు. పీడిత కులాల మధ్య చిచ్చు ఎంత కాలం రగిలిస్తారని స్పష్టమైన జనాభా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ గణన జరపాలని అదేవిధంగా, శ్రామిక కులాలను విభజించి మీరు సాధించేది ఏమిటని వారు అన్నారు. అదేవిధంగా ఎస్సీ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ ఏళ్ల తరబడి చేయడం లేదని, రాబోయే రోజుల్లో వర్గీకరణ ఆపకపోతే పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు కొనసాగిస్తామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో మాలల గ్రామ పెద్దలు బడుగు వెంకటేశ్వర్లు, బేతి రాంబాబు, తలారి వెంకటి, తలారి రాంబాబు, బడుగు రవి, బడుగు (చిన్ని) వెంకటేశ్వర్లు, అంబేద్కర్ యూత్ సభ్యులు ఇల్లంగి. బాలకృష్ణ, బేతి నాగబాబు, బడుగు. గణేష్, బడుగు నాగేశ్వరరావు, భేతి. వంశీకృష్ణ, కొండ. వంశీ, బడుగు. విష్ణు, బడుగు. వినోద్, రాయి రాజా తదితరులు పాల్గొన్నారు..

Join WhatsApp

Join Now