ఎంపీ రఘునందన్ రావును కలిసిన శ్రీ వెంకటేశ్వర కాలనీవాసులు

మెదక్/నర్సాపూర్, డిసెంబరు 29 (ప్రశ్న ఆయుధం న్యూస్): నర్సాపూర్ పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర కాలనీకి చెందిన బీజేపీ ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాపగారి రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో కాలనీవాసులు ఎంపీ రఘునందన్ రావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఆదివారం హైదరాబాదులోని ఎంపీ రఘునందన్ రావు నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి కాలనీ సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా సమస్యల పరిష్కారానికి 50 లక్షలు నిధులు కావాలని ప్రతిపాదనలను ఎంపీకి అందజేశారు. తన సాధ్యమైనంత మేరకు నిధులు ఇవ్వడానికి కృషి చేస్తానని ఎంపీ రఘునందన్ రావు సానుకూలంగా స్పందించారని తెలిపారు. అనంతరం ఎంపీ రఘునందన్ రావు ను కాలనీవాసులు శాలువాతో సన్మానించారు. ఎంపీని కలిసిన వారిలో శ్రీ వెంకటేశ్వర కాలనీ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, ఆంజనేయులు, శ్రీనివాస్ గౌడ్, శంకర్ నాయక్, వెంకట్ గౌడ్, శ్రీనివాస్, బీజేపీ నాయకులు అంజిగౌడ్ తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now