పెండింగ్ ఓటరు దరఖాస్తులు త్వరగా పరిష్కరించండి:
సిఇఓ ఆదేశాలు
ఫామ్ 6,7,8 పరిష్కారం, వందేళ్ల ఓటర్ల పరిశీలనపై దృష్టి
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
(ప్రశ్న ఆయుధం) అక్టోబర్ 16
పెండింగ్‌లో ఉన్న ఫామ్ 6,7,8 ఓటరు దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి జిల్లాల ఎన్నికల అధికారులను ఆదేశించారు. గురువారం వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ బిఎల్ఓలకు ఐడి కార్డుల పంపిణీ, నూతన ఓటర్లకు ఎపిక్ కార్డుల పంపిణీ వేగవంతం చేయాలని సూచించారు. కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ జిల్లాలో 259 దరఖాస్తులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని, 100 సంవత్సరాల పైబడిన 106 మంది ఓటర్ల వివరాలు పరిశీలిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్, డిఆర్ఓ మధు మోహన్, ఆర్డీవో పార్థసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.