కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్‌కు గౌరవం — గవర్నర్ చేతుల మీదుగా సిల్వర్ మెడల్ స్వీకరణ

కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్‌కు గౌరవం — గవర్నర్ చేతుల మీదుగా సిల్వర్ మెడల్ స్వీకరణ

100% లక్ష్య సాధన: తొలి త్రైమాసికంలో గర్భిణుల ANC నమోదు, డయాబెటిస్ & రక్తపోటు పరీక్షలపై పూర్తి సఫలత.

ఐసిడీఎస్-ఆరోగ్య కార్డుల వినియోగం: గర్భిణులకు పోషకాహారం వినియోగం, ఆరోగ్య కార్డుల పంపిణీలో విశేష ప్రగతి.

SHG ప్రోత్సాహం: స్వయం సహాయ సంఘాలకు రివాల్వింగ్ ఫండ్ పూర్తిస్థాయిలో అందింపు.

ఉత్తమ పనితీరు గంగారం మండలానిదే: వ్యవసాయం, సామాజిక అభివృద్ధి అంశాల్లో నూతన ప్రమాణాలు.

అవార్డు ప్రదానం: ఆగస్టు 2న, సాయంత్రం 4 గంటలకు, హైదరాబాద్‌లో గవర్నర్ చేతులమీదుగా అవార్డు.

హైదరాబాద్…2024లో నిర్వహించిన సంపూర్ణత అభియాన్ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రంలో గంగారం మండలం చేసిన అత్యుత్తమ పనితీరు ఇప్పుడు రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందింది. జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ నేతృత్వంలో మండల స్థాయిలో చేపట్టిన ఆరోగ్య, పోషణ, స్వయం సహాయ సంఘాల బలోపేతం, సామాజిక అభివృద్ధి కార్యక్రమాల్లో 100 శాతం లక్ష్యాల సాధన జరిగింది.

ఈ సందర్భంగా నీతి ఆయోగ్ ప్రకటించిన రాష్ట్రస్థాయి పురస్కారాల్లో సిల్వర్ మెడల్ ను గంగారం మండలానికి ప్రకటించింది. ఈ అవార్డును ఆగస్టు 2వ తేదీ సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్‌లోని కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ చేతుల మీదుగా కలెక్టర్ స్వీకరించనున్నారు.

ఇది జిల్లాకే గర్వకారణంగా మారింది. ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేసి, ప్రజల మద్ధతుతో అభివృద్ధిని సాధించినందుకు గాను ఈ అవార్డు జిల్లా యంత్రాంగానికి లభించింది.

Join WhatsApp

Join Now

Leave a Comment