ప్రజాభిప్రాయాన్ని గౌరవించండి….
పాదయాత్రకు అడ్డంకులు ఎందుకు….
నరేందర్ రెడ్డి అరెస్టు అప్రజాస్వామిక చర్య…
అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ శ్రేణులను వెంటనే విడుదల చేయాలి…
మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి డిమాండ్.
కొడంగల్ నియోజకవర్గములో ఫార్మా కంపెనీల పేరుతో రైతుల భూములను లాక్కోవటాన్ని నిరసిస్తూ శాంతియుతంగా పాదయాత్ర చేసి నిరసన తెలపాలని సిద్ధం అయినా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్టును మాజీ మంత్రి,ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తీవ్రంగా ఖండించారు.ప్రజా పాలన అంటూ గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం, ఇనుప కంచెలు తొలిగింఛామని,ధర్నా చౌక్ తెరిచామని ఒక వైపు చెబుతూ,మరోవైపు ప్రజాస్వామ్యయుతంగా,శాంతియుతంగా పాదయాత్ర చేపడితే ఎందుకు అడ్డుకుంటుందని ప్రశ్నించారు. ఇలాంటి నిర్బంధాలు గతంలో ఎన్నడూ చూడలేదని,గ్రామం నుండి మొదలు కొని నగరం వరకు వందలాది మంది బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను అరెస్ట్ చేయటం జరిగిందని వారందరినీ వెంటనే విడుదల చేయాలని సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు.మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి తో పాటు,ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకుల అరెస్టును తీవ్రంగా ఖండించారు. అరెస్టులతో ప్రజా ఉద్యమాలను ఆపలేరని,ఫార్మా సిటీ కోసం ఇప్పటికే సిద్దంగా ఉన్న భూములను వదిలిపెట్టి కొడంగల్ పరిధిలోని 5 గ్రామాల్లోని 3 వేల ఎకరాల భూమి సేకరించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ప్రజల అభిప్రాయాలను గౌరవించాలని,వెంటనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు.