సంగారెడ్డి/పటాన్ చెరు, అక్టోబర్ 28 (ప్రశ్న ఆయుధం న్యూస్): బొల్లారం పారిశ్రామిక వాడలో నివసించే ఉత్తర భారతీయ మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రతి ఏటా కార్తీక మాసంలో ఛట్ పూజలను ఘనంగా నిర్వహించారు. స్థానిక సూర్య భగవాన్ ఆలయంలో జరిగిన పూజల్లో ఎస్పీ పరితోష్ పంకజ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పోలీస్ శాఖ తరఫున ఏర్పాటు చేసిన ప్రత్యేక బందోబస్తును ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా స్థానిక యువజన నాయకుడు వి.ప్రవీణ్ రెడ్డి, దిననాథ్, మా అంభి మహిళా సేవా సమితి సభ్యుల ఆధ్వర్యంలో ఎస్పీ పరితోష్ పంకజ్, పటాన్ చెరు డీఎస్పీ ప్రభాకర్ ను కలిసి ఘనంగా సన్మానించారు. ప్రశాంతమైన వాతావరణంలో పూజలు జరుపుకునేలా సహకరించడంపై ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్మిక నాయకులు లక్కణ్, యువజన నాయకులు మధుకర్ రెడ్డి, సాయి, అంబి మహిళా సేవా సమితి సభ్యులు దుర్గవతి దేవి, గీత దేవి, ఆషా, ఆర్తి, పూనమ్, మీరా, చోటి తదితరులు పాల్గొన్నారు.