రోడ్ల మీద దుమ్ము తో శ్వాస కోశవ్యాధులు…

రోడ్ల మీద దుమ్ము తో శ్వాస కోశవ్యాధులు…

వెంకటాపురం,డిసెంబర్ 12

ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని ముర్రవానిగూడెం గ్రామ పరిధిలో ఉన్న ప్రధాన రహదారి అధ్వానంగా మారిందని ప్రజలు వాపోయారు. గ్రామం మధ్యలో రోడ్డు రిపేర్ వర్క్ జరిగి పూర్తి చేయకపోవడంతో రోడ్డు పైన వాహనాలు తిరగడం వలన దుమ్ము, దూళి, ఇళ్లలో వచ్చి ప్రజలు తీవ్రంగా అనారోగ్యం ఫాలో అవుతున్నారని ప్రజలు తెలిపారు.ప్రధాన రహదారిపై చిప్స్ మెటల్ పోసి వదిలేసారని ప్రజలు అన్నారు.ప్రధానంగా ముర్రవాణి గూడెం గ్రామంలో రోడ్డు పక్కన అంగన్వాడి పాఠశాల, ప్రాథమిక పాఠశాల,ఉన్నందువలన వాహనాలురోడ్ల పై తిరగడంతో పాఠశాలలో దుమ్ము, ధూళి వెళ్లి విద్యార్థులు శ్వాసకోస వ్యాధులతో తీవ్ర అనారోగ్యం పాలవుతున్నారని ప్రజలు తెలిపారు. దుమ్ము, దూళి కారణంగా కళ్ళు ఎర్రబడటం, చర్మ సంబంధ వ్యాధులు, ఊపిరితిత్తులు పాడవడం వంటి వ్యాధులు వస్తున్నాయని విద్యార్థులు,తల్లిదండ్రులు,ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు రోడ్డు పనులు పూర్తిచేయాలని కోరారు. ప్రధాన రహదారిపై రోడ్డు వేసే వరకైనా వాటర్ ట్యాంక్ తో రోడ్డు తడపాలని సంబంధిత అధికారులను కోరారు.

Join WhatsApp

Join Now

Leave a Comment