సంగారెడ్డి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 30 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి ప్రభుత్వ మెడికల్ కళాశాల ముందు ప్రైవేటు అంబులెన్స్ వాహనాలు నిర్బంధంగా నిలిపివేయడంతో విద్యార్థులు, సిబ్బంది, రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న విషయమై అధికారులు స్పందించి ప్రైవేటు అంబులెన్సులను పక్కకు తీయించారు. ఈ మేరకు *ప్రశ్న ఆయుధం న్యూస్ పేపర్* లో *సంగారెడ్డి మెడికల్ కళాశాల వద్ద ప్రైవేట్ అంబులెన్సుల పార్కింగ్* అనే వార్తకు అధికారులు స్పందించారు. ఈ మేరకు ప్రభుత్వ మెడికల్ కళాశాల ముందు ప్రైవేటు అంబులెన్స్ వాహనాలు నిల్పకుండా పక్కకు నిలుపుకునేలా చర్యలు తీసుకున్నారు. దీంతో పలువురు ప్రశ్న ఆయుధం న్యూస్ పేపర్ ప్రతినిధికి ధన్యవాదాలు తెలిపారు.
ప్రశ్న ఆయుధం వార్తకు స్పందన.. సంగారెడ్డి మెడికల్ ఆసుపత్రి ముందు అంబులెన్సులు నిలపకుండా చర్యలు
Published On: October 30, 2025 10:22 pm